Mukesh Ambani: స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
- ఒక్కో షేరుపై రూ.100 లాభం!
- బుధవారం ఒక్కరోజే రూ.52,032 కోట్లు పెరిగిన కంపెనీ వ్యాల్యుయేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: దేశీ స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు ప్రస్తుతం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కంపెనీ క్యూ4 ఫలితాల అనంతరం స్టాక్ మార్కెట్‌లో ఈ కంపెనీ షేర్లు దూసుకుపోతున్నాయి. వరుసగా మూడు రోజులుగా రిలయన్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపిస్తుండటంతో కంపెనీ మార్కెట్ విలువ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు ఆశించిన దానికంటే మెరుగ్గా రావడంతో బుధవారం ట్రేడింగ్‌లో రిలయన్స్ షేరు సుమారు 3 శాతం మేర పెరిగి ఇన్వెస్టర్లను ఆకర్షించింది.
వరుసగా మూడవ రోజు లాభాలు
సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ రిలయన్స్ మాత్రం తన జోరును తగ్గించడం లేదు. బుధవారం మధ్యాహ్నం సమయానికి రిలయన్స్ షేరు రూ.1,416 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా, ఒక దశలో 2.77 శాతం పెరిగి 1,427.40 రూపాయల గరిష్ట స్థాయిని తాకింది. గత శుక్రవారం 1,327.65 రూపాయల వద్ద ఉన్న షేరు ధర, కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 100 రూపాయల (సుమారు 7.50 శాతం) మేర పెరిగింది. ఈ షేర్ల పెరుగుదల కారణంగా కంపెనీ మార్కెట్ విలువ అనూహ్యంగా పెరిగింది. గత మూడు రోజుల్లోనే రిలయన్స్ మార్కెట్ విలువ సుమారు రూ.1.35 లక్షల కోట్లు పెరిగింది. గత వారం రూ.18 లక్షల కోట్ల లోపు ఉన్న రిలయన్స్ మార్కెట్ క్యాప్, ఇప్పుడు ఏకంగా రూ.19.31 లక్షల కోట్ల మార్కును దాటేసింది. ఇదే జోరు గనుక మరో రెండు రోజులు కొనసాగితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.20 లక్షల కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read
- PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
పెరుగుదలకు కారణాలు ఇవే..
రిలయన్స్ ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాలే ఈ లాభాలకు ప్రధాన కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిటైల్, టెలికాం రంగాల్లో కంపెనీ చూపుతున్న స్థిరమైన వృద్ధి ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. బుధవారం ఒక్కరోజే కంపెనీ వ్యాల్యుయేషన్ సుమారు రూ.52,032 కోట్లు పెరగడం గమనార్హం. మొత్తానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీ మార్కెట్లలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ రూ.20 లక్షల కోట్ల మార్కును ఎప్పుడు అందుకుంటుందోనని దలాల్ స్ట్రీట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
తాజావార్తలు
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!