రోజుకో లేటెస్ట్ మోడల్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చిపడుతున్నాయి. తాజాగా రియల్ మీ సంస్థ 5 జీ టెక్నాలజీకి సంబంధించి Realme Narzo 50 5G మోడల్ స్మార్ట్ ఫోన్ విడుదల చేయడానికి రెడీ అయింది. 4 జీ టెక్నాలజీ మొబైల్స్ తర్వాత ఇప్పుడు 5 జీ టెక్నాలజీ మొబైల్స్ మార్కెట్లో ఆదరణ పొందుతున్నాయి. రియల్ మీ సంస్థ తాజాగా అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్స్ తో ఫోన్ విడుదల చేస్తోంది. దీనికి సంబంధించి లీక్ లు బయటపడుతున్నాయి.
రియల్ మీ నార్జో పేరుతో కొత్త మోడల్స్ విడుదల చేయనుంది. అందులో Narzo 50, Narzo 50A, Narzo 50A Prime, Narzo 50i మోడల్స్ వున్నాయి. వీటితో పాటు Narzo 50 5G మోడల్ అన్నిటికంటే ఉత్తమంగా వుండనుంది. ధర కూడా భారీగానే వుంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. సరికొత్త టెక్నాలజీ ద్వారా వివిధ రకాల ఫోన్లు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. అన్ని వర్గాల వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఇవి మారుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 4 జీ నెట్వర్క్ తో ఎన్నో కంపెనీలకు చెందిన ఫోన్లు ఉండగా మరికొన్ని కంపెనీలు రాబోయే 5 జీ నెట్వర్క్ ని దృష్టిలో ఉంచుకొని మార్కెట్లోకి అత్యంత తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.
Narzo 50 5G స్పెసిఫికేషన్స్
* 5జీ టెక్నాలజీ
* 5G ప్రాసెసర్
* మీడియా టెక్ డెమెన్షిటీ 810
* 13 మెగాపిక్సెల్ కెమేరా 2 ఎంపీ డెప్త్ సెన్సార్
* SoC అప్లికేషన్
* 6.58-inch FHD+ AMOLED టచ్ స్క్రీన్
* 90 Hz రిఫ్రెష్ రేట్
* 6 జీబీ RAM
* 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ
* 4800 ఎంఏహెచ్ బ్యాటరీ
* 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్
* ఆండ్రాయిడ్ 12, వర్చువల్ RAM ఎక్స్ పాన్సన్
* Realme UI 3.0