NTV Telugu Site icon

RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య సమీక్ష.. ఈసారి కూడా వడ్డీరేట్లు యథాతథం

Rbi

Rbi

RBI: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీకాలం డిసెంబర్ 10వ తేదీతో అయిపోయింది. మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు కనిపిస్తుంది. దీంతో చివరి ఎంపీసీ సమావేశంలోనైనా వడ్డీ రేట్లను తగ్గించి ఊరట కల్పిస్తారా లేదా అన్న సందేహాలు స్టార్ట్ అయ్యాయి. అయితే, ప్రస్తుతం సీఆర్ఆర్ 4.5, రెపోరేటు 6.5 శాతంగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ భారీగా పడిపోవడానికి వీటిని తగ్గించకపోవడమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేడు ఏం చేస్తారో వేచి చూడాలి.

Read Also: AUS vs IND: నా కెరీర్‌లో ఎప్పుడూ చూడలేదు.. భారత్‌ సిద్ధంగా ఉండాలి: రవిశాస్త్రి

కాగా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ రెండో త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని ఈరోజు (డిసెంబర్ 6) ప్రకటించనుంది. అయితే, ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచే ఛాన్స్ ఉంది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి రెపో రేటును గరిష్ఠ స్థాయిలోనే సెంట్రల్‌ బ్యాంక్‌ ఉంచుతుంది. ఈ క్రమంలో మరోసారి ఈ రేట్ల జోలికి వెళ్లకుండానే ద్రవ్య సమీక్షను ఆర్బీఐ ముగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు అటు బ్యాంకింగ్‌, ఇటు ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. రిటైల్‌, హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణాలు బాగా పెరగడమే దీనికి ప్రధాన కారణం.

Read Also: Chhattisgarh: బీజేపీలో చేరినందుకు.. మాజీ సర్పంచ్‌లను కిడ్నాప్ చేసి చంపిన నక్సల్స్!

అయితే, అక్టోబర్‌లో ఏకంగా వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం 6.21 శాతానికి చేరిపోయింది. ఇక, మిశ్రమ ఆర్థిక పరిస్థితుల వల్ల నగదు నిల్వల నిష్పత్తి (CRR)ని తగ్గించే ఛాన్స్ ఉందనే అంచనాలు ఉన్నాయి. ఒక వేళా ఇదే జరిగితే బ్యాంకులకు నిధుల లభ్యత పెరగనుంది. ఫలితంగా ఆయా రంగాలకు చౌకగా లోన్స్ లభిస్తాయి. వడ్డీరేట్లను తగ్గించకుండా ఈ రకంగా మార్కెట్‌కు ఊరట ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా చూస్తున్నట్లు సమాచారం.

Read Also: Deep Technology Summit-2024: నేడు డీప్ టెక్ సమ్మిట్-2024.. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు

ఇక, ఆర్బీఐ గోల్డ్‌ నిల్వలను క్రమంగా పెంచుకుంటుంది. అక్టోబర్‌ నెలలో సెంట్రల్‌ బ్యాంకులు 60 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంట్లో రిజర్వు బ్యాంక్‌ అత్యధికంగా 27 టన్నుల గోల్డ్‌ను సేకరించినట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ వరకు మొత్తం 77 టన్నుల బంగారం కొనగా.. అందులో సెంట్రల్‌ బ్యాంక్‌ 27 టన్నులు కొనుగోలు చేసినట్లు ఐఎంఎఫ్‌ రిలీజ్ చేసిన నివేదిక ఆధారంగానే డబ్ల్యూజీసీ వెల్లడించింది.

Show comments