RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొబైల్ ఫోన్ల కొనుగోలుదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊరటనిచ్చింది. ప్రస్తుత రోజుల్లో చాలామంది కొత్త స్మార్ట్ఫోన్లను సులభ వాయిదాల పద్ధతి లేదా లోన్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అయితే.. ఏదైనా ఆర్థిక ఇబ్బంది వల్ల ఒకటి లేదా రెండు ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే, సదరు ఫైనాన్స్ కంపెనీలు లేదా బ్యాంకులు రిమోట్ యాక్సెస్ ద్వారా వినియోగదారుల ఫోన్లను పూర్తిగా లాక్ (బ్లాక్) చేస్తున్నాయి. దీనివల్ల ఫోన్ అసలు ఆన్ కాకపోవడం, అత్యవసర కాల్స్ కూడా చేసుకోలేకపోవడం వంటి సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ విధానంపై ఆర్బీఐ తాజాగా స్పష్టతనిచ్చింది.
బుధవారం విడుదల చేసిన సవరించిన డ్రాఫ్ట్ మార్గదర్శకాల ప్రకారం.. లోన్ బకాయిలు చెల్లించలేదనే కారణంతో కస్టమర్ల మొబైల్ ఫోన్లను పూర్తిగా బ్లాక్ చేయడం లేదా డిసేబుల్ చేయడం చట్టవిరుద్ధమని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులు కానీ, ఇతర ఆర్థిక సంస్థలు (NBFCs) కానీ ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని నియంత్రణ సంస్థ గట్టిగా తేల్చిచెప్పింది.
Also Read
- Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన 'షాపింగ్' కింగ్..
- Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- RBI New FD Rules: ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టే వారికి కీలక సమాచారం.. RBI కొత్త నిబంధనలతో ఏం మారుతుంది?
- OBHS Team Railway: రైళ్లలో కొత్త హౌస్కీపింగ్ బృందం.. ఇక జనరల్ కోచ్లలోనూ ఫస్ట్ క్లాస్ తరహా శుభ్రత..!
ఫీచర్లపై ఆంక్షలు ఓకే..
అయితే, లోన్ రికవరీ కోసం బ్యాంకులకు ఆర్బీఐ కొన్ని మినహాయింపులను ఇచ్చింది. ఈఎంఐలు సకాలంలో చెల్లించనప్పుడు, సదరు మొబైల్లోని కొన్ని రకాల ఫీచర్లను లేదా యాప్లను తాత్కాలికంగా పరిమితం చేసే హక్కు బ్యాంకులకు ఉంటుంది. కానీ, ఫోన్ను యాక్సెస్ చేయకుండా పూర్తిగా లాక్ చేయడం కస్టమర్ల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది.
ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ కొత్త నియమాలు కేవలం మొబైల్ ఫోన్ కొనుగోలు కోసం ప్రత్యేకంగా తీసుకున్న లోన్లకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర వ్యక్తిగత రుణాలు లేదా హోమ్ లోన్ల బకాయిల కోసం బ్యాంకులు కస్టమర్ల మొబైల్ ఫోన్ ఫీచర్లపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ అనేది ప్రాథమిక అవసరంగా మారిన నేపథ్యంలో.. కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
Agadha Trailer: రక్తం, రహస్యాలు, దైవిక శక్తుల పోరు.. వణుకు పుట్టిస్తున్న ఎంఎస్ రాజు ‘అగధ’ ట్రైలర్!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Karnataka Cabinet Expansion 2026: కర్ణాటకలో నేడు మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల జాబితా విడుదల
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!