Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan Teases Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026-27లో ఈస్ట్ జోన్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా టోర్నీ మొత్తం వార్తల్లో నిలిచాడు. బ్యాటింగ్‌తో పాటు జట్టు యాజమాన్యం తనపై ఉంచిన నాయకత్వ బాధ్యతలతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే టోర్నీ అనంతరం ఇషాన్, వైభవ్ మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ వ్యవహరించిన విషయం తెలిసిందే. సెమీఫైనల్లో ఇషాన్ కిషన్ గాయం కారణంగా మైదానం వీడిన సమయంలో బుడ్డోడు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయంలో డీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా అతడికి వచ్చింది. కొన్ని సందర్భాల్లో వైభవ్ తీసుకున్న రివ్యూలు సరైనవిగా తేలడంతో.. అతడి క్రికెట్ పరిజ్ఞానంపై ప్రశంసలు వచ్చాయి. ఫైనల్లోనూ ఇషాన్ కెప్టెన్‌గా మైదానంలో ఉన్నప్పటికీ.. రివ్యూ తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాల్లో వైభవ్ కీలకంగా వ్యవహరించాడు. ఫైనల్లో ఓ సందర్భంలో వైభవ్.. ఇషాన్‌ను రివ్యూ తీసుకోవాలని ఒప్పించాడు. ఆ నిర్ణయం సరైనదిగా తేలడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
అయితే తాజాగా బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో ఇషాన్ కిషన్ ఈ విషయంపై వైభవ్‌ను సరదాగా ఆటపట్టించాడు. ‘ప్రతి రివ్యూకూ క్రెడిట్ మొత్తం వైభవే తీసేసుకున్నాడు. నేను అప్పటికే రివ్యూ తీసుకోవాలని అనుకున్నా.. కానీ వైభవ్ వచ్చి ‘నేను మీ దగ్గరకు వస్తాను’ అంటూ చెప్పాడు. ఆ తర్వాత ఇంటర్నెట్లో మాత్రం వైభవ్ అంటూ క్రెడిట్ అంతా అతడికే వెళ్లిపోతుంది’ అంటూ ఇషాన్ నవ్వుతూ చెప్పాడు. ఇషాన్ వ్యాఖ్యలకు వైభవ్ కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ‘అయితే మీరు ఫీల్డ్ బయటకు వెళ్లినప్పుడు రివ్యూలు ఎవరు తీసుకున్నారు? అది కూడా చెప్పండి’ అంటూ ప్రశ్నించాడు. సెమీఫైనల్లో ఇషాన్ మైదానం వీడిన సమయంలో తానే డీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ వైభవ్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది.
ఇషాన్ కిషన్ కూడా వైభవ్ నాయకత్వ లక్షణాలను ప్రశంసించాడు. ‘అవును.. అది వైభవే. భవిష్యత్ కెప్టెన్ కావచ్చు. చూద్దాం ఎలా సాగుతుందో’ అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు కామెంటేటర్లు కూడా రివ్యూ విషయంలో వైభవ్‌పై ఆధారపడాలని సూచించిన విషయాన్ని ఇషాన్ గుర్తు చేశాడు. ‘ఇప్పుడు రివ్యూ తీసుకోవాలంటే వైభవ్ దగ్గరకు వెళ్లాల్సిందే’ అని కామెంటేటర్లు చెప్పిన విషయాన్ని ప్రస్తావించాడు. వైభవ్ ఆటగాడిగా మాత్రమే కాకుండా జట్టులోని ప్రతి ఒక్కరినీ చూసుకునే మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి అని ఇషాన్ ప్రశంసించాడు. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా అందరినీ పట్టించుకుంటాడని చెప్పాడు. అయితే వైభవ్‌ను జూనియర్ ప్లేయర్ అని చెప్పబోయి.. ‘అరే.. జూనియర్ అయితే నువ్వే కదా.. సారీ సారీ’ అంటూ ఇషాన్ సరదాగా నవ్వులు పూయించాడు.
When the Captain and Vice-Captain meet, you can expect a whole lot of fun and banter! 😄
A wholesome chat between Ishan Kishan and Vaibhav Sooryavanshi post East Zone’s memorable #DuleepTrophy triumph 🏆👏 – By @jigsactin #EZvSZ | @ishankishan51 pic.twitter.com/3kRQC6pVT4
— BCCI Domestic (@BCCIdomestic) September 11, 2026
తాజావార్తలు
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!