RBI : ఇల్లు కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. కీలక వడ్డీరేట్లను యధాతథం
సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. వరుసగా 11వ సారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. కీలక వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగించడం వల్ల ఇండ్ల కొనుగోలుదారులకు తక్కువ వడ్డీరేట్లకే ఇంటి రుణాలు లభించనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ముగిసిన ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని తీర్మానించింది. రెపో, రివర్స్రెపో రేట్లతోపాటు అన్ని రకాల వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతాయని ఆర్బీఐ వెల్లడించింది.
వచ్చే ఏడాది మార్చి (2023 మార్చి 31) నెలాఖరు వరకు హోంలోన్ నిబంధనలను హేతుబద్ధీకరిస్తూ ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. ఇంతకుముందు కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 అక్టోబర్‌లో రిస్క్ వెయిట్స్‌ను హేతుబద్ధీకరించింది. 2022 మార్చి నెలాఖరు వరకు ఇండ్ల రుణాలు తీసుకున్న వారికి లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది.
Also Read
- Today Gold and Silver Prices: బంగారం ధరల మంటలు.. నేడు మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
- Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) విలువ 80 శాతం అంతకంటే తక్కువ ఉంటే, రిస్క్ వెయిట్ 35 శాతం.. 80 శాతానికి పైగా / 90 శాతం ఎల్టీవీ ఉంటే రిస్క్ వెయిట్ 50 శాతం ఇస్తారు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇచ్చే ఇండ్ల రుణాల కోసం పక్కన బెట్టే మొత్తం నిధులను రిస్క్ వెయిట్ అని పిలుస్తారు. రిస్క్ వెయిట్ ఎక్కువగా ఉంటే బ్యాంకులు రుణాలివ్వడానికి ముందుకు రావు. మరోవైపు అమెరికాలో వడ్డీరేట్లను పెంచనున్నట్లు ఫెడరల్ రిజర్వ్ స్పష్టం చేసింది. దేశీయంగా ఇంధన, కమొడిటీ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం కలవరపెడుతోంది. అయినప్పటికీ.. ఆర్బీఐ మాత్రం వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం
గమనార్హం.
తాజావార్తలు
-
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
-
Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..
-
TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
-
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
-
Malkajgiri: డేటింగ్ యాప్‌లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్‌తో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ముంచిన యువతి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో