ఈరోజుల్లో ఎప్పుడూ ఏ అవసరం వస్తుందో చెప్పడం కష్టం దాంతో ముందుగానే డబ్బులను దాచుకోవాలని అనుకుంటారు.. ఇందుకోసం ఎన్నో రకాల పెట్టుబడి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.. మిగిలిన వాటితో పోలిస్తే పోస్టాఫీస్ లోని స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని ఇస్తాయి.. అందుకే ఎక్కువ మంది ఈ పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.. అలాంటి సేవింగ్ స్కీమ్ లలో ఒకటి కిసాన్ వికాస్ పత్రా.. ఈ స్కీమ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ పథకంలో పెట్టుబడి పెట్టడంతో సెక్యూరిటీతో పాటు, కేవలం 115 నెలలు అంటే 9.7 ఏళ్లలో డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.. ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టినవారికి 7.5 శాతం వడ్డీని పొందుతారు.. గత ఏడాది వడ్డీ తక్కువగా ఉండేది.. ఈ ఏడాది వడ్డీని పెంచారు.. ఈ స్కీమ్ మెచ్యూరిటీ సమయం 115 నెలలుగా నిర్ణయించారు. నిజానికి మొదట్లో మెచ్యూరిటీ పీరియడ్ 123 నెలలుగా ఉండేది, ఆ తర్వాత 120 నెలలకు తగ్గించారు.. ఇప్పుడు 115 నెలలుగా నిర్ణయించారు..
ఇకపోతే ఈ స్కీమ్ లో మినిమమ్ పెట్టుబడి రూ.1000 రూపాయల ఉంటుంది. మ్యాక్సీమమ్ అంటూ పరిమితి లేదు.. ఎంతైనా ఇన్వెస్ట్ చెయ్యొచ్చు.. ఖాతాదారులు ఎంతైనా సేవింగ్స్ చేసుకోవచ్చు.. అయితే మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. 7.5 శాతం వడ్డీని వర్తింపజేస్తే, మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 20 లక్షలకు చేరుతుంది. ఇక మెచ్యూరిటీకి ముందే అకౌంట్‌ను క్లోజ్ చేసుకునే అవకాశం కల్పించారు.. వడ్డీ మొత్తాన్ని మీరు పొందవచ్చు.. పన్ను మినహాయింపు కూడా ఉంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..