PM Kisan Yojana: రైతులకు అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Kisan Yojana : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఇప్పుడు ఒకే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు. ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చే 23వ విడత డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి అందే ఈ ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6 వేల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా విభజించి ఒక్కోసారి రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది చిన్న, సన్నకారు రైతులు ప్రయోజనం పొందుతున్నారు.
Also Read
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
ఇప్పటికే ఈ పథకం కింద 22 విడతలు విడుదలయ్యాయి. తాజాగా 22వ విడతను 2026 మార్చి 13న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సాధారణంగా ఈ పథకం కింద ప్రతి విడత మధ్య సుమారు నాలుగు నెలల వ్యవధి ఉంటుంది. ఆ లెక్కన చూస్తే 23వ విడత విడుదలకు సంబంధించిన సమయం జూన్ నెలలో పూర్తవుతోంది.
అయితే గత విడతల విడుదల తేదీలను పరిశీలిస్తే, నాలుగు నెలల గడువు పూర్తయిన వెంటనే నిధులు విడుదల కావడం తప్పనిసరి కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 23వ విడత జూన్‌లో కాకుండా జూలై నెలలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. జూన్ నెలలోనే విడత విడుదల తేదీపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని పథకానికి సంబంధించిన వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక తేదీ ప్రకటించబడలేదు.
ఇదిలా ఉంటే, పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు పొందాలంటే రైతులు కొన్ని కీలక ప్రక్రియలను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ముఖ్యంగా ఈ కేవైసీ పూర్తి చేయడం, ఆధార్‌ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయడం, భూ ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయడం వంటి అంశాలు అత్యంత కీలకం. ఈ ప్రక్రియల్లో ఏదైనా పెండింగ్‌లో ఉంటే రైతులు విడత మొత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
అందువల్ల 23వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులు తమ పథకం ఖాతా వివరాలను ఒకసారి పరిశీలించుకోవడం మంచిది. అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియలు పూర్తయ్యాయో లేదో నిర్ధారించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తేదీ ప్రకటించిన వెంటనే అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ కానున్నాయి. దీంతో ఇప్పుడు రైతులందరి చూపు 23వ విడత విడుదల తేదీపైనే నిలిచింది.
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!