Congress: వీర్ సావర్కర్‌ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత, కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. సావర్కర్ ‘‘గొడ్డు మాంసం’’ తినేవాడని అతను వ్యాఖ్యానించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది. వినాయక్ దామోదర్ మాంసాహారే అని గోహత్యకు వ్యతిరేకం కాదని ఆయన కామెంట్స్ చేశారు.
గాంధీ జయంతి సందర్భంగా బెంగళూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దినేష్ గుండూరావు మాట్లాడుతూ..సావర్కర్ బీఫ్ తినేవాదని అన్నారు. సావర్కర్ బ్రహ్మణుడైనప్పటికీ సంప్రదాయ ఆహార నియంత్రణల్ని పాటించలేదని, ఆధునికవాది అని మంత్రి అన్నారు. సావర్కర్ అభిప్రాయాలతో మహాత్మా గాంధీ విభేదించేవారని, సావర్కర్ భావజాతం ఛాందసవాదం వైపు మొగ్గు చూపుతుందని, గాంధీ విశ్వాసాలు లోతైన ప్రజాస్వామ్యమని మంత్రి పేర్కొన్నాడు. గాంధీ హిందూ సాంస్కృతిక సంప్రదాయవాదంపై లోతైన విశ్వాసం కలిగిన కఠినమైన శాఖాహారి అని, ఇద్దరు నేతల మధ్య వ్యత్యాసాన్ని చెప్పాడు. ఇదే కాకుండా దినేష్ గుండూరావు మహ్మద్ అలీ జిన్నా గురించి కూడా వ్యాఖ్యానించారు. జిన్నా ఎప్పుడూ హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ కాదని, అతను పందిమాంసం కూడా తినేవారని కొందరు చెబుతుండేవారని చెప్పారు.
Read Also: Hamas: హమాస్ గాజా చీఫ్ ఖతం.. ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మృతి..
కాంగ్రెస్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఆర్ అశోక్ స్పందించారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ దేవుడు టిప్పు సుల్తాన్, కాంగ్రెస్ ఎల్లప్పుడు హిందువుల్ని టార్గెట్ చేస్తుంది, ముస్లింలను ఎందుకు టార్గెట్ చేయడు..? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో హిందువులు తీర్పు చెబుతారని, ప్రతీ హిందువు వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ వ్యక్తులకు(కాంగ్రెస్) సావర్కర్ గురించి ఏం తెలియదు, సావర్కర్ ఆవులపై తన అభిప్రాయాలను చాలా చక్కగా చెప్పారని, ఆవులు రైతులకు పుట్టినప్పటి నుంచి చనిపోయే దాకా సాయం చేస్తాయని, అందుకే ఆవుని దేవతతో సమానంగా కొలుస్తామని చెప్పారు.