దసరా పండుగను పురస్కరించుకుని విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. రూ. 49,999కి ఎస్ 1 స్కూటర్, రూ. 40,000 వరకు విలువైన పండుగ ఆఫర్‌లను వెల్లడించింది. ఇందులో హైపర్‌చార్జింగ్ క్రెడిట్‌లు, MoveOS+ అప్‌గ్రేడ్, యాక్సెసరీస్ & కేర్+పై ప్రత్యేకమైన డీల్‌లు, ఇర్రెసిస్టిబుల్ అద్భుతమైన ఆఫర్‌లు ఉన్నాయి. బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్‌ను గురువారం (అక్టోబర్ 3) నుంచి మొదలు పెట్టింది.