ప్రపంచంలోని అత్యంత అత్యాధునిక, వినూత్నమైన వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలలో ఒకటైన జర్మనీకి చెందిన స్కాన్‌లైన్ వీఎఫ్‌ఎక్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. కంటెంట్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మరింత ముందుకు వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. స్కాన్‌లైన్ “స్ట్రేంజర్ థింగ్స్” “కౌబాయ్ బెబాప్”తో సహా అనేక నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌లపై ఈ స్టూడియో పని చేసింది.
అనేక మార్వెల్, డీసీ టైటిల్స్ కోసం స్కాన్‌లైన్ స్టూడియో వైవిధ్యమైన ఎఫెక్ట్స్ ను అందించింది. 1989లో స్థాపించబడిన స్కాన్‌లైన్‌కి వాంకోవర్, మాంట్రియల్, లాస్ ఏంజిల్స్, లండన్, మ్యూనిచ్, స్టట్‌గార్ట్ లతో పాటు సియోల్‌లలో కార్యాలయాలు ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్ కోసం, స్కాన్‌లైన్ “స్ట్రేంజర్ థింగ్స్ 4,” “బ్లడ్ రెడ్ స్కై,” “స్లంబర్‌ల్యాండ్,” “ది గ్రే మ్యాన్,” “ది ఆడమ్ ప్రాజెక్ట్” “డోంట్ లుక్ అప్”పై పని చేసింది. అంతేకాకుండా ఈ స్టూడియో “గేమ్ ఆఫ్ థ్రోన్స్,” “జస్టిస్ లీగ్” “బ్లాక్ విడో,” “బ్లాక్ పాంథర్,” “కెప్టెన్ మార్వెల్,” “ఐరన్ మ్యాన్ 3,” “కెప్టెన్ అమెరికా: ది వింటర్ సోల్జర్,” వంటి సినిమాల కోసం ప్రత్యేక ఎఫెక్ట్స్‌ను అందించింది.