ప్రముఖ ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి ఎన్నో పథకాలను అందిస్తూ ప్రజల నమ్మకానికి పొందింది.. అందుకే రోజూ రోజుకు పాలసీలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది.. ఎల్ఐసి అందిస్తున్న పథకాలలో ఎల్ఐసీ ధన్ సంచయ్ పాలసీ కూడా ఒకటి. ఇది బీమా కవరేజీని అందించడంతో పాటు భవిష్యత్ ఆదాయ వనరులను కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఐసీ ధన సంచయ్ పాలసీ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..
నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది రక్షణ, పొదుపు ప్రయోజనాలను అందిస్తుంది. పాలసీ వ్యవధిలో పాలసీదారుడు దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో ఈ ప్రత్యేక ప్లాన్ నామినీకి ఆర్థిక రక్షణను అందిస్తుంది. అంతేకాక ఈ ప్లాన్ మెచ్యూరిటీ చెల్లింపు వ్యవధిలో పాలసీదారులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. మీరు అధికారిక ఎల్ఐసీ వెబ్‌సైట్ నేరుగా సందర్శించడం ద్వారా లేదా ఏజెంట్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు.. ఈ పాలసీ పూర్తి వివరాలు…
ఈ పాలసీని 10, 15 సంవత్సరాల టర్మ్ ని ఎంచుకోవచ్చు. లెవెల్ ఇన్‌కమ్ బెనిఫిట్‌తో సింగిల్ ప్రీమియం లెవల్ ఇన్‌కమ్ బెనిఫిట్ , సింగిల్ ప్రీమియం మెరుగుపరచబడిన కవర్ కోసం పాలసీ టర్మ్ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉంటుంది. ధన్ సంచయ్ ప్లాన్ ప్రారంభించడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు ఉండాలి..ప్లాన్ కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 15 ఏళ్ల టర్మ్‌తో లభిస్తుంది. లెవెల్ ఇన్‌కమ్ బెనిఫిట్, ఇంక్రీసింగ్ ఇన్‌కమ్ బెనిఫిట్, సింగిల్ ప్రీమియం లెవెల్ ఇన్‌కమ్ బెనిఫిట్, సింగిల్ బెనిఫిట్ పేరుతో నాలుగు రకాల ప్రయోజనాలను అందిస్తుంది… పాలసి దారుడు మరణిస్తే నామీనికి డబ్బులు చెందుతాయి.. అలాగే లోన్ పొందే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.. పన్ను మినహాయింపు కూడా ఉంది..