Infosys : ఇన్ఫోసిస్‌కు ఊరట.. నోటీసు ఉపసంహరించుకున్న ప్రభుత్వం
- ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట
- నోటీసు ఉపసంహరించుకున్న కర్ణాటక ప్రభుత్వం
- వివరణ ఇవ్వాలని కోరిన డీజీజీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పన్ను ఎగవేతకు పాల్పడిన అంశంలో దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు ఊరట లభించింది. కర్ణాటక ప్రభుత్వం కంపెనీకి పంపిన రూ.32,403 కోట్ల నోటీసును ఉపసంహరించుకుంది. ఈ సమాచారాన్ని టెక్ దిగ్గజం గురువారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పంచుకుంది. బుధవారం నోటీసు జారీ చేసిన తర్వాత గురువారం స్వయంగా కంపెనీ ఓ వివరణ జారీ చేసింది.
READ MORE: Viva Harsha Divorce: విడాకులు తీసుకున్న కమెడియన్ హర్ష.. అసలు నిజం ఇదే..
Also Read
- India 1947 vs 2026 Prices: బంగారం నుంచి పెట్రోల్ వరకు.. 1947లో ఎంత? ఇప్పుడు ఎంత? ధరల పూర్తి జాబితా
- LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
- Amrit Bharat Express: 7 కొత్త అమృత్ భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు కీలక కనెక్టివిటీ
- TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్‌కు కేంద్రం గుడ్‌బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
కంపెనీ గురువారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో, కర్ణాటక రాష్ట్ర అధికారుల నుంచి కంపెనీకి సందేశం అందిందని తెలిపింది. అందులో తమకు పంపిన షో నోటీసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. కంపెనీకి జీఎస్టీ డిమాండ్ నోటీసు జారీ అనంతరం దీనిపై సమాధానం ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) కోరింది. వివరణ అనంతరం కంపెనీకి ఊరట లభించింది.
READ MORE:Himachal : హిమాచల్‌లో క్లౌడ్ బరస్ట్.. నలుగురు మృతి, 49 మంది గల్లంతు
కాగా.. డీజీజీఐ పంపిణ నోటీలో జులై 2017 నుంచి 2021-2022 వరకు పన్ను ఎగవేసినట్లు పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ తన విదేశీ శాఖల నుంచి సేవలను పొందిందని, అయితే వాటిపై రూ.32,403 కోట్ల పన్ను చెల్లించలేదని డీజీజీఐ ఆరోపణలు చేసింది. ఇన్ఫోసిస్ సేవల దిగుమతిపై IGSTని చెల్లించనందుకు విచారణలో ఉందని పన్ను పత్రం పేర్కొంది. దీనిపై కంపెనీ సమాధానం చెప్పింది.
READ MORE: Paris Olympic 2024 : నేడు మరోసారి బరిలో మను భాకర్.. మూడో పతకం సాధించేనా?
ఈ నోటీసును ప్రీ-షో కాజ్ నోటీసుగా పేర్కొంటూ కంపెనీ ఈ వివరణ ఇచ్చింది. అటువంటి ఖర్చులపై జీఎస్టీ వర్తించదని వివరణ ఇచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. భారతీయ సంస్థకు విదేశీ శాఖలు అందించే సేవలు జీఎస్టీకి లోబడి ఉండవని ఇన్ఫోసిస్ తెలిపింది. జీఎస్టీ చెల్లింపు అనేది ఐటీ సేవల ఎగుమతికి వ్యతిరేకంగా క్రెడిట్ లేదా వాపసు కోసమని చెప్పింది. జీఎస్టీ బకాయిలన్నీ చెల్లించామని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నామని కంపెనీ తెలిపింది.
తాజావార్తలు
-
Mahindra BE 6 Formula E Freedom Edition: ‘Revive’ ఎమర్జెన్సీ ఫీచర్ తో.. మహీంద్రా BE 6 ఫార్ములా ఈ ఎడిషన్ రిలీజ్
-
Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
-
India Test Cricket History: 94 ఏళ్ల టెస్ట్ ప్రయాణం.. 600వ మ్యాచ్‌కు చేరుకున్న టీమిండియా చరిత్ర ఇదే..!
-
Mahindra BE 6 SPORTEQ: మహీంద్రా BE6 స్పోర్టెక్ ఎలక్ట్రిక్ SUV విడుదల.. 683KM రేంజ్, Gemini AIతో అదిరిపోయే ఫీచర్లు
-
Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!