Jio Recharge Plan: జియో నుంచి అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ వచ్చింది. రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.103 తో చౌక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటితో వస్తుంది. నిజానికి దీనిని జియో OTT ప్లాట్‌ఫామ్స్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా ఎంత GB డేటాను అందిస్తుంది, అలాగే ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను అందిస్తుందో తెలుసుకుందాం.
READ ALSO: Most Expensive Metal: ఒకే ఒక్క గ్రాము.. 200 కిలోల బంగారంతో సమానం! ఇంతకీ అదేంటో తెలుసా?
రూ. 103 ప్లాన్ 5GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. డేటాతో పాటు ఈ ప్లాన్ ఒక ప్రీమియం OTT సేవను కూడా అందిస్తుంది. జియో వినియోగదారులు హిందీ ఎంటర్టైన్మెంట్, ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్, ప్రాంతీయ కంటెంట్ నుంచి దానిని ఎంచుకోవచ్చు. రీఛార్జ్ చేసిన తర్వాత OTT ప్రయోజనాలను ఎంచుకోవడానికి అనుమతించే MyJio వోచర్‌ను అందుకుంటారు. హిందీ వినోద ఎంపికలలో Sony LIV, JioHotstar, ZEE5 ఉన్నాయి. అంతర్జాతీయ వినోద ఎంపికలలో FanCode, JioHotstar, Discovery+, Lionsgate Play ఉన్నాయి. ప్రాంతీయ కంటెంట్ వీక్షకులు JioHotstar, Kanchha Lannka, Sun NXT, Hoichoi వంటి OTT లు అందుబాటులో ఉన్నాయి.
MyJio వోచర్‌ను రిడీమ్ చేసుకున్న తర్వాత, మీరు ఎంచుకున్న OTT సబ్‌స్క్రిప్షన్‌ను 28 రోజుల పాటు ఆస్వాదించగలరు. JioTV యాప్ Sony LIV, ZEE5, Discovery+, Lionsgate Play, Kanchha Lannka, Sun NXT, FanCode, Hoichoi వంటి ప్లాట్‌ఫారమ్‌లకు కూడా ఈ ప్లాన్ యాక్సెస్‌ను అందిస్తుంది. కొత్త ప్లాన్‌తో ఇప్పటి వరకు జియో ప్రారంభించిన మొత్తం ప్రీపెయిడ్ ప్లాన్‌ల సంఖ్య 110 కి పైగా పెరిగింది. అలాగే జియో పోటీదారు అయిన ఎయిర్‌టెల్ కూడా చౌకైన ఎంటర్టైన్మెంట్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఇది రూ.100 కు 6GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ 30 రోజుల చెల్లుబాటుతో 20 కి పైగా OTT యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.
READ ALSO: Delhi: ఇకపై ఢిల్లీలో ‘తందూరీ రోటీ’ బంద్.. ఎందుకో తెలుసా!