Gold Prices: ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన పెట్టుబడి ఏదైనా ఉందంటే.. అది కేవలం బంగారం కొనుగోలు చేయడమే. ఎందుకంటే బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి తప్ప.. తగ్గే అవకాశం లేదు. ఒకవేళ బంగారం ధరల తగ్గినా అది కొద్ది రోజుల మాత్రమే… అది కూడా కేవలం రూపాయలల్లోనే తగ్గుతాయి.. కానీ పెరగడం మాత్రం పదుల్లో పెరుగుతాయి. అయితే బంగారం ధరలను చాలా మంది ప్రతి రోజూ చూస్తూ ఉంటారు. వారికి అనుకూలంగా ఉన్న రోజున.. లేదా మంచిరోజున బంగారం కొనుగోలు చేసుకోవడం కోసమని. బంగారం ధరలను పరిశీలిస్తే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు చూస్తే బంగారం ధర ప్రతి ఏడాది పెరుగుతూనే వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది 1947 ఆగస్టు 15న బంగారం తులం(10 గ్రాములు) ధర రూ. 88. 62 ఉంది. అది కాస్త 76 సంవత్సరాల తరువాతి ఇప్పుడు తులం రూ. 60,160గా ఉంది. 76 ఏళ్లల్లో బంగారం ధరలు ఎలా పెరిగాయో చూడండి..
Read also: Maoists Letter: కూనారం భూముల పట్టాలు పంపిణీ చేయండి.. మావోయిస్టులు లేఖ కలకలం..
బంగారం ధరలు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ.60,000 దాటింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీపావళి నాటికి దీని ధర రూ. 65 వేలకు చేరుకుంటుందంటున్నారు. అయితే 1947లో బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి దేశం విముక్తి పొందినప్పుడు బంగారం ధర 1947 ఆగస్టు 15న 10 గ్రాముల బంగారం ధర రూ.88.62. స్వాతంత్య్రం వచ్చిన నాటి బంగారం ధరను, ప్రస్తుతం ఉన్న బంగారం ధరను పోల్చి చూస్తే, అప్పటి నుంచి ఇప్పటి వరకు 59900 రూపాయలకు పైగా పెరిగింది. సుమారు 700 రెట్లకు పైగా బంగారం ధర పెరిగింది. ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకులు వచ్చినప్పుడల్లా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు జనం చూస్తుంటారు. రిజర్వ్ బ్యాంకులో కరెన్సీ ముద్రణకు కూడా బంగారమే ఆధారం. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోని అన్ని రంగాలలో మాంద్యం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలులో బిజీగా ఉన్నారు. 1959లో బంగారం తొలిసారి రూ.100 స్థాయికి చేరుకొని. 1964లో రూ. 63కి పడిపోయింది. ఆ తర్వాత 1967లో బంగారం ధర మళ్లీ 100 రూపాయలకు చేరి.. ఆ తరువాత ఎప్పుడు కూడా బంగారం ధరలు తగ్గలేదు. 1948లో 10 గ్రాముల బంగారం ధర రూ.95.87కి పెరిగింది. 1959లో బంగారం ధర మొదటిసారిగా రూ. 100 దాటి 10 గ్రాములకు రూ.102.56కి చేరింది. 1967లో బంగారం ధర రూ. 102.5 చేరుకుంది. 1974లో బంగారం ధర తొలిసారిగా రూ.500 స్థాయికి చేరుకుంది. 1985లో బంగారం ధర రూ. 2000 స్థాయికి వచ్చింది. 1996లో బంగారం ధర రూ.5160కి చేరింది. 2007లో బంగారం ధర రూ.10,800 స్థాయికి వచ్చింది. 2010లో బంగారం ధర రూ. 20000 మార్కు చేరుకుంది. 2011లో బంగారం ధర ఏకంగా పాతికవేలు దాటి రూ. 26,400కి చేరింది. 2018లో బంగారం ధర రూ. 30,000 కంటే ఎక్కువకు చేరింది. 2020లో బంగారం ధర తొలిసారి రూ. 50,000 మార్కు దాటింది. 2022లో బంగారం ధర రూ. 60,000 చేరుకోగా.. 2023లో బంగారం ధర 63,000 వరకు వచ్చింది.