IRCTC Fund raising: ప్రయాణికుల డేటాతో వెయ్యి కోట్లు.. ఐఆర్సీటీసీ ఫండ్ రైజింగ్ ప్లాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IRCTC Fund raising: ఇండియన్ రైల్వేస్‌కి టికెట్ బుకింగ్ సర్వీస్ అందిస్తున్న ఐఆర్సీటీసీ.. ప్రయాణికుల సమాచారంతో వెయ్యి కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కన్సల్టెంట్‌ని ఎంపిక చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీలతో నిర్వహించే బిజినెస్ కార్యకలాపాల్లో భాగంగా ఈ ప్యాసింజర్ డేటాని ఇచ్చిపుచ్చుకోనుంది. అయితే ఈ ప్రక్రియలో కన్జ్యూమర్ల వ్యక్తిగత సమాచార గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకూడదంటూ షరతు పెట్టింది.
‘విండ్‌ఫాల్’లో కోత
Also Read
- Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌లో కోత పెట్టింది. దేశీయంగా ఉత్పత్తి చేసే క్రూడాయిల్‌పై ఇప్పటివరకు విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను టన్నుకు 17 వేల 750 రూపాయలు వసూలు చేస్తుండగా దాన్ని 13 వేల రూపాయలకు తగ్గించింది. ఇది ఈ రోజు నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ నిర్ణయం ఓఎన్జీసీ మరియు వేదాంత లిమిటెడ్‌లకు ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు.
Indian Employees: బాస్‌లు అలెర్ట్.. ఉద్యోగులు ఎప్పుడైనా షాక్ ఇవ్వొచ్చు…! తాజా సర్వే
నెట్ సెల్లర్‌గా ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ నెలలో యూఎస్ కరెన్సీ నెట్ సెల్లర్‌గా నిలిచింది. స్పాట్ మార్కెట్లో 18 పాయింట్ తొమ్మిదీ ఆరు బిలియన్ యూఎస్ డాలర్లను కొనుగోలు చేసిన ఆర్బీఐ.. అంతకన్నా ఎక్కువగా మూడూ పాయింట్ ఏడూ ఒకటీ తొమ్మిది బిలియన్ డాలర్లను విక్రయించింది. ఈ మేరకు కేంద్ర బ్యాంకు ఆగస్టు బులెటిన్‌ని విడుదల చేసింది. గతేడాది జూన్‌లో ఆర్బీఐ.. యూఎస్ కరెన్సీ నెట్ బయ్యర్‌గా వ్యవహరించగా ఈసారి నెట్ సెల్లర్‌గా నిలిచింది.
3 వారాల కనిష్టానికి
అమెరికాలో మళ్లీ వడ్డీ రేట్లు పెరిగే అవకాశంతోపాటు డాలర్ బలపడుతుండటంతో బంగారం ధరలు ఇవాళ మూడు వారాల కనిష్టానికి పడిపోయాయి. ఔన్స్ బరువు కలిగిన స్పాట్ గోల్డ్ రేటు సున్నా పాయింట్ 2 శాతం తగ్గింది. దీంతో ఒక ఔన్స్ పసిడి ధర 17 వందల 54 రూపాయలకు పైగా పలుకుతోంది. జులై 29వ తేదీ తర్వాత ఇదే అతి తక్కువ రేటని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ వారం మొత్తమ్మీద బంగారం ధర రెండూ పాయింట్ 6 శాతం తగ్గింది.
ఐసీటీ బడ్జెట్ పెంపు
మన దేశంలో 50 శాతానికి పైగా ఎంటర్‌ప్రైజ్‌లు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ బడ్జెట్లను గణనీయంగా పెంచాయి. సైబర్ సెక్యూరిటీ అనేది కంపెనీలకు కీలకాంశంగా మారిందని, దీనికోసం గతేడాది కన్నా ఈసారి ఎక్కువ ఖర్చుపెడుతున్నట్లు డేటా అండ్ అనలిటిక్స్ కంపెనీ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. కొవిడ్ అనంతరం దేశవ్యాప్తంగా డిజిటల్ టెక్నాలజీల వినియోగం పెరగటమే దీనికి కారణమని పేర్కొంది.
బీఎస్ఈ రికార్డ్
ఇండియన్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డును నెలకొల్పాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదైన కంపెనీల మొత్తం పెట్టుబడులు 280 లక్షల కోట్లకు పైగా చేరాయి. నిన్న ట్రేడింగ్ పూర్తయ్యే సమయానికి నమోదైన ఈ ఇన్వెస్ట్మెంట్లు ఆల్‌టైమ్ రికార్డు కావటం విశేషం. కొన్ని రోజులుగా బుల్ ర్యాలీ కొనసాగుతుండటం ఈ ఫీట్ సాధించటానికి దోహపడింది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?