Infosys: “వర్క్ ఫ్రమ్ హోం”కి ఇన్ఫోసిస్ గుడ్ బై.. వారానికి 5 రోజులు ఆఫీస్ నుంచే పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infosys: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ‘వర్క్ ఫ్రం హోం’ పాలసీని ముగించింది. క్రమంగా తన ఉద్యోగులను ఆఫీసులకు రావాలని పిలుస్తోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని పరిచయం చేశాయి. గత రెండేళ్లుగా కోవిడ్ దాదాపుగా తగ్గిపోయింది. ఇక తన ఉద్యోగులు కంపెనీలకు రావాలని పలు ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలి ఆఫీసులకు వచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇలాంటి వారిపై చర్యలకు కూడా సిద్ధం అవుతామని ఐటీ కంపెనీలు హెచ్చిస్తున్నాయి.
గూగుల్ తో సహా అనేక టెక్ కంపెనీలు WFH విధానాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాయి. భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొంతమంది ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కఠినంగా ఆదేశించింది. ఇన్ఫోసిస్ అమెరికా, కెనడాల్లోని తన ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేయాలని ఆదేశించింది. రిమోట్ గా పనిచేయాలంటే తప్పని సరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలని ఉద్యోగులకు తెలియజేసింది. వారానికి ఐదు రోజలు ఆఫీస్ నుంచి పనిచేయాలని ఆదేశించింది. ఎవరైనా కొత్త వర్క్ పాలసీని పాటించడంతో విఫలం అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇన్ఫోసిస్ కు యూఎస్, కెనడాల్లో 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
Also Read
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్‌లో నయా ట్రెండ్
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
Read Also: Oracle: కొనసాగుతున్న లేఆఫ్స్.. ఒరాకిల్‌లో మరో విడత ఉద్యోగుల తొలగింపు
అయితే ఈ వర్క్ పాలసీ ప్రస్తుతానికైతే భారతదేశానికి వర్తింప చేయలేదు. అయితే గతేడాది ఉద్యోగులు క్రమంగా ఆఫీసులకు రావడానికి మూడు దశల ప్రణాలిక ప్రవేశపెట్టింది. మొదటి దశలో ఉద్యోగుల సౌలభ్యం ప్రకారం వారానికి రెండు రోజలు కార్యాలయాలకు రావాలి. రెండవదశలో ఉద్యోగులు వేరే బ్రాంచ్ కు మార్చడం లేదా ట్రాన్స్ఫర్స్ చేసుకునే ఛాయిస్ ఇచ్చింది. మూడో దశలో హైబ్రీడ్ మోడ్ లో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైబ్రీడ్ మోడ్ ప్రకారం ఉద్యోగులు ఖచ్చితంగా వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలి.
ఫిబ్రవరి నెలలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మాట్లాడుతూ.. యువకులు కూడా ఇంటి వద్ద నుంచి పనిచేస్తామని పట్టుబట్టకూడదని.. నైతికత, సోమరితనంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. మూన్ లైటింగ్, వర్క్ ఫ్రం హోమ్, వారానికి మూడు రోజులే వస్తానని కోరవద్దని ఆయన ఉద్యోగులకు సూచించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!