Tax Refund: ఇన్కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..
- ఆదాయ పన్ను కట్టే వారికి బిగ్ షాక్..
- ఆధార్, పాన్ లింక్ చేయని వారికి రీఫండ్ నిలిపివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదాయ పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం ఓ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 1.3 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రావాల్సిన రూ.340 కోట్ల రూపాయల రీఫండ్ డబ్బులు ఆగిపోయాయి. దీనికి ప్రధాన కారణం వారి పాన్ కార్డ్ ఇంకా ఆధార్‌తో లింక్ కాకపోవడమే.
చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. అలా చేయని వారి పాన్ కార్డ్ ‘ఇన్-ఆపరేటివ్’లోకి వెళ్లిపోతుంది. ఇలా జరిగినప్పుడు.. మీరు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినా, మీకు రావాల్సిన రీఫండ్ డబ్బులను ప్రభుత్వం మీ ఖాతాలో వేయదు. ఆ డబ్బులను ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంటుంది. మీరు మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసిన తర్వాతే ఆ డబ్బులు మీకు అందుతాయి.
Also Read
- Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
Also Read:Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో ఈ వివరాలను తెలియజేశారు. జనవరి 1, 2026 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 9.25 కోట్ల మందికి పైగా ప్రజల పాన్ కార్డ్‌లు ఆధార్‌తో లింక్ అవ్వక పనిచేయడం లేదు. అంతేకాదు.. ఆలస్యంగా లింక్ చేసినందుకు గానూ ప్రభుత్వం జరిమానాల రూపంలోనే రూ.2,338 కోట్లకు పైగా వసూలు చేసింది.
పాన్ కార్డ్ పని చేయకపోతే, మీ ఆదాయంపై టీడీఎస్ (TDS) సాధారణం కంటే ఎక్కువగా (దాదాపు 20%) కోత విధిస్తారు. పాన్ కార్డ్ యాక్టివ్‌గా లేకపోతే పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం లేదా విత్ డ్రా చేయడం కష్టమవుతుంది. ప్రస్తుతం ఆధార్-పాన్ లింక్ చేయడానికి రూ.1,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
రీఫండ్ పొందడం ఎలా..?
మీ రీఫండ్ ఆగిపోయి ఉంటే కంగారు పడనక్కర్లేదు. మీరు చేయాల్సిందల్లా వెంటనే ఇన్కమ్ టాక్స్ పోర్టల్‌లోకి వెళ్లి నిర్ణీత రుసుము చెల్లించి ఆధార్‌ను లింక్ చేయడమే. మీరు లింక్ చేసిన తర్వాత పాన్ కార్డ్ మళ్ళీ పని చేయడం ప్రారంభిస్తుంది.. అప్పుడు నిలిచిపోయిన మీ డబ్బులు మీ బ్యాంకు ఖాతాకు చేరతాయి.
కాబట్టి.. మీ పాన్ కార్డ్ స్టేటస్‌ను ఒకసారి చెక్ చేసుకొని.. లింక్ అవ్వకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయడం మంచిది. దీనివల్ల అనవసరమైన జరిమానాలు, డబ్బులు ఆగిపోవడం వంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!