Hyundai: మొబైల్ ఆసుపత్రిని ప్రారంభించిన హ్యుందాయ్ మోటార్స్..ఎక్కడంటే..?
- త్వరలో భారతీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్న హ్యుందాయ్ మోటార్
- తన ఐపీవో (Hyundai IPO) కోసం సెబీ(SEBI)కి పత్రాల సమర్పణ
- ఔరంగాబాద్‌లో మొబైల్ మెడికల్ యూనిట్ ప్రారంభం
- ఈ స్పర్శ్ సంజీవని మొబైల్ మెడికల్ యూనిట్లను ప్రారంభించిన మహారాష్ట్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హ్యుందాయ్ మోటార్ త్వరలో భారతీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుంది. కంపెనీ తన ఐపీవో (Hyundai IPO) కోసం సెబీ(SEBI)కి పత్రాలను కూడా పంపింది. తాజాగా ఈ కంపెనీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మరియు ఔరంగాబాద్‌లో మొబైల్ మెడికల్ యూనిట్‌ను ప్రారంభించింది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ భారతీయ అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. ఈ స్పర్శ్ సంజీవని మొబైల్ మెడికల్ యూనిట్లను మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి, క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రి గిరీష్ మహాజన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.
READ MORE: Encounter: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల హతం..
Also Read
- Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
కంపెనీ కార్పొరేట్ వ్యవహారాల విభాగంలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మరియు వెర్టికల్ హెడ్ పునిత్ ఆనంద్ మాట్లాడుతూ.. సర్వతోముఖాభివృద్ధికి ఆరోగ్యకరమైన జనాభా మొదటి అవసరం అన్నారు. “ఇది హ్యుందాయ్ యొక్క గ్లోబల్ విజన్. ‘ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ’కి కూడా అనుగుణంగా ఉంది. నాగ్‌పూర్, ఔరంగాబాద్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని మొబైల్ మెడికల్ యూనిట్ల సహాయంతో చికిత్స అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ పని కోసం హ్యుందాయ్ ప్రత్యేక మైటీ వ్యాన్‌లను మొబైల్ మెడికల్ యూనిట్‌లుగా మార్చాం. ఇందులో అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు పరీక్షలు, ఉచిత కన్సల్టేషన్ సౌకర్యాలు కల్పిస్తాం. ” అని పేర్కొన్నారు.
READ MORE:Wagh Nakh: లండన్ నుంచి ముంబై చేరుకున్న ఛత్రపతి శివాజీ ఆయుధం ‘‘వాఘ్ నఖ్’’
మొబైల్ మెడికల్ యూనిట్‌లోని ప్రతి వ్యాన్‌లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు. ఈ వ్యాన్ గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలకు ఉచితంగా వైద్య సలహాలు, మందులు అందజేస్తుంది. అన్ని వ్యాన్‌లలో ఆధునిక వైద్య పరీక్షా సౌకర్యాలు, పరీక్ష సాధనాలతో పాటు బ్లడ్ షుగర్, మలేరియా, డెంగ్యూ మరియు రక్తపోటును పరీక్షించే సౌకర్యాలు ఉంటాయి.
తాజావార్తలు
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!