ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. ప్రైమ్ డే పేరుతో సేల్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జూలై 20,21వ తేదీల్లో ఈ సేల్‌ను ప్రారంభించనుంది. కేవలం ప్రైమ్ యూజర్లకు మాత్రమే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా పలు రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో పాటు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్ అందించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో ప్రధాన ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సైతం అదిరిపోయే సేల్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
READ MORE: Viral Video: బైక్‌పై చంటి బిడ్డ.. హైవేపై ఒళ్లుగగుర్పొడిచే స్టంట్
ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లను ఆకర్షించడానికి తరచుగా స్పెషల్ సేల్ ఈవెంట్స్ నిర్వహిస్తుంటుంది. ముఖ్యమైన పండుగలకు, అలాగే ప్రతి నెలా కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ తాజాగా ‘గోట్ సేల్’ను అనౌన్స్ చేసింది. జులై 19 నుంచి 23 వరకు జరిగే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. ఇవే కాకుండా.. గోట్ సేల్‌లో కస్టమర్లకు అదనపు డిస్కౌంట్స్ అందించడానికి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ వివిధ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. కస్టమర్లు ప్రతి ట్రాన్సాక్షన్‌పై 10% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కొనుగోలుదారులు ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంకులు అందించే నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను సొంతం చేసుకోవచ్చు. మొదటి ఫ్లిప్‌కార్ట్ UPI ట్రాన్సాక్షన్‌పై రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది.
READ MORE: Ambati Rambabu: ముద్రగడ లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు..
గూగుల్ పిక్సెల్ 8 : ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ధర రూ.61,999. అయితే ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో దీన్ని కేవలం రూ.47,999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ ద్వారా రూ.4000 డిస్కౌంట్, ఎంపిక చేసిన మోడల్స్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా అదనంగా మరో రూ. 4,000 తగ్గింపు పొందవచ్చు. ఇక పిక్సెల్ 7 ప్రో మోడల్‌పై కూడా ఆఫర్ ఉంది. గోట్‌సేల్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ. 50,999 డిస్కౌంట్ ధరతో సొంతం చేసుకోవచ్చు. ఈ మోడల్ ప్రస్తుత ధర రూ.55,999.
నథింగ్ ఫోన్ (2) : సెమీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (2)పై గోట్‌సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.33,999 కాగా, ఆఫర్‌లో భాగంగా దీన్ని రూ.28999కే కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ ద్వారా అదనంగా మరో రూ. 3,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ సేల్‌లో నథింగ్ ఫోన్ (2a) మోడల్ రూ.19,999 డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంటుంది.
ఐఫోన్ 14 ఫ్లస్ : 6.7 అంగుళాల ఐఫోన్ 14 ఫ్లస్ ప్రస్తుత ధర రూ.55,999. అయితే బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్‌తో గోట్‌సేల్‌లో ఇది రూ.53,999కు అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్ భారీ డీల్స్ ప్రకటించింది.
READ MORE:Viral Video: బైక్‌పై చంటి బిడ్డ.. హైవేపై ఒళ్లుగగుర్పొడిచే స్టంట్
మోటొరొలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro) : గోట్ సేల్ ఈవెంట్‌లో మోటొరొలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ.28000 లోపే లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ టీజర్‌లో పేర్కొంది. ఈ మిడ్ రేంజ్ మోడల్ ధర రూ.29,999 నుంచి ప్రారంభం అవుతుంది. బ్యాంక్ ఆఫర్స్‌తో దీనిపై రూ. 2,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఎంపిక చేసిన మోడల్స్ ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే అదనంగా మరో రూ.2,000 బోనస్ కూడా లభిస్తుంది.