Hindustan Copper share: కాపర్కూ రెక్కలు.. ఆరు నెల్లలో 190% రిటర్న్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindustan Copper share: ప్రస్తుతం బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. ఈ రెండు లోహాల ధరలు రోజు రోజుకూ భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు కాపర్ ధరలు సైతం ఇదే రేంజ్లో దూసుకుపోతున్నాయి. తాజాగా హిందుస్తాన్ కాపర్ షేరు మరోసారి దూకుడుగా దూసుకెళ్లింది. బంగారం, వెండి లాగే ఇప్పుడు కాపర్ ధరలు సైతం భారీగా పెరగడంతో ఈ కంపెనీ షేరు ఒక్క రోజులోనే దాదాపు 20 శాతం ఎగబాకింది. ఎన్ఎస్ఈలో హిందుస్తాన్ కాపర్ షేరు రూ.745 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. గత ఆరు నెలలగా చూస్తే, ఈ షేరు ఏకంగా 190 శాతం కంటే ఎక్కువ లాభాన్ని ఇచ్చింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం.. కాపర్ ధరలు వరుసగా రికార్డులు సృష్టించడమే అని చెబుతున్నారు. కాపర్ ధరలు పెరుగుతుంటే, హిందుస్తాన్ కాపర్ షేరు సైతం అదే దారిలో దూసుకెళ్తోంది. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాపర్ ఫ్యూచర్స్ ధర ఉదయం ట్రేడింగ్‌లోనే 6.49 శాతం పెరిగి కిలోకు రూ.1,407కు చేరింది. అంతేకాదు.. ఈ రోజు కాపర్ ధర ఎంసీఎక్స్‌లో జీవితకాల గరిష్ఠమైన రూ.1,432.35ను తాకింది.
READ MORE: UK-China: అమెరికాకు దూరమవుతోన్న మిత్ర దేశాలు.. చైనాతో బ్రిటన్ కీలక ఒప్పందం
Also Read
- Credit Card Tips: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ 5 ఛార్జీలపై ఒక లుక్కేయండి.. లేదంటే అప్పుల పాలవుతారు!
- Reliance Industries: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగ.. ఐదు రోజుల్లోనే రూ.24 వేల కోట్ల సంపద
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- LIC: ఎల్ఐసీ నుంచి జీవన్ సాథి పేరుతో రెండు కొత్త ప్లాన్లు.. మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ బెనిఫిట్స్
అంతర్జాతీయ మార్కెట్లలోనూ కాపర్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, డాలర్ బలహీనపడటం వల్ల పెట్టుబడిదారులు భౌతిక లోహాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాపర్‌కు డిమాండ్ పెరిగింది. చైనాలోని షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్లో అత్యధికంగా ట్రేడయ్యే కాపర్ కాంట్రాక్టు ధర 6 శాతం కంటే ఎక్కువ పెరిగి టన్నుకు 108,740 యువాన్‌కు చేరింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇది 109,570 యువాన్‌తో ఆల్‌టైమ్ హైను కూడా నమోదు చేసింది. ట్రేడర్ల వివరాల ప్రకారం.. ఇటీవలి కాలంలో బంగారం, వెండిలో భారీ లాభాలు ఆర్జించిన పెట్టుబడిదారులు తాజాగా కాపర్ వైపు మారుతున్నారు. దీంతో కాపర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రపంచ స్థాయిలో కాపర్ ప్రాధాన్యం వేగంగా పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు “డాక్టర్ కాపర్” అని పిలిచే ఈ లోహం, ఇప్పుడు కమోడిటీలలో “రాజు”గా మారుతోందని బ్లూమ్‌బర్గ్ ఇన్టెలిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేసింది. 2026 నాటికి పెద్ద మైనింగ్ కంపెనీల లాభాల్లో కాపర్ వాటా 35 శాతానికి పైగా ఉండవచ్చని అంచనా వేస్తోంది.
READ MORE: Bhumana Karunakar Reddy: జగన్‌ను దెబ్బ తీసేందుకు హిందువుల మనోభావాలతో చంద్రబాబు, పవన్ ఆడుకున్నారు..
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!