Mumbai PSI Durga Kharde’s assault video: సోషల్ మీడియాలో ఓ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ముంబైలోని ఒక మహిళా పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (PSI), ఫిర్యాదుదారులకు మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం వీడియోలో కనిపిస్తోంది. వాదన సమయంలో సబ్-ఇన్‌స్పెక్టర్ దుర్గా ఖర్డే తన నేమ్‌ప్లేట్ బ్యాడ్జ్‌ను తీసివేసి ఫిర్యాదుదారుపై విసిరేస్తోంది. ఇదే నా పేరు.. ఏం పీ*టావో పీ*క్కో అనే రీతిలో దౌర్జన్యం చేస్తోంది. బూతులు తిడుతూ.. కొట్టడానికి మీదికి వస్తోంది. ఈ సంఘటన ముంబైలోని వీపీ రోడ్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది.
READ MORE: Samsung Discounts: శాంసంగ్ బిగ్ సేల్.. అదనపు టీవీ, ఉచిత సౌండ్‌బార్ మీ సొంతం!
జాతీయ మీడియా సంస్థల కథనం ప్రకారం.. ఈ వీడియోలో పోలీసుల దాడికి గురైన ఓ మహిళ, పురుషుడు ఓ అంశంపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కి చేరుకున్నారు. కానీ.. ఆ పోలీసుల అధికారిని ఫిర్యాదు తీసుకునేందుకు తిరస్కరించింది. తమ ఫిర్యాదు స్వీకరించి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆ యువకుడు, యువతి కోరారు. అయినా పట్టించుకోకపోవడంతో పోలీసుల నిర్లక్ష్యపు వైఖరిని బయటపెట్టాలని ఆ యువకుడు వీడియో తీశారు. దీంతో సబ్-ఇన్‌స్పెక్టర్ దుర్గా ఖర్డే ఒక్కసారిగా ఊగిపోయింది. బూతులు తిడుతూ రెచ్చిపోయింది. పక్కన ఉన్న పోలీసులు ఆపేందుకు యత్నించిన శాంతించలేదు. అంతేకాదు.. వీడియో తీస్తున్న బాధితుడు ఈ నిర్వహకాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేస్తానని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన ఆ మహిళా పోలీసు తన జేబుపై ఉన్న నేమ్‌ప్లేట్‌ని తీసి విసిరేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే వేగంగా వైరల్ అయ్యింది. పోలీసుల నిర్వహకంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ముంబై పోలీసుల గిర్గావ్ ఏసీపీ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. వీడియో, సంఘటనను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
महाराष्ट्र: मुंबई का गिरगांव VP road पुलिस स्टेशन में (PSI) दुर्गा खर्डे द्वारा एक शिकायतकर्ता के साथ दुर्व्यवहार करना बहुत ही निंदनीय है।
वीडियो में दिख रहा है कि पुलिस अधिकारी शिकायतकर्ता से बहस कर रही हैं और
गुस्से में अपनी नेमप्लेट फेंककर मार रही है!@DGPMaharashtra pic.twitter.com/NmSfIgMTxS
— Manish Yadav (@ManishY78062388) September 22, 2025