Site icon NTV Telugu

Govt Banks: వామ్మో.. ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ రూ. 8,500 కోట్లు

Bank

Bank

ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే ఖాతాదారుల నుంచి బ్యాంకులు పెనాల్టీ వసూలు చేస్తున్నాయి. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ ద్వారా రూ.8,500 కోట్లు ఆర్జించాయి. అయితే, దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ (SBI) 2020 ఆర్థిక సంవత్సరం నుంచే మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీని వసూలు చేయడం నిలిపివేసింది. కానీ గత ఐదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ మొత్తం 38 శాతం పెరిగింది. లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు.

READ MORE: Andhra Pradesh: ఏపీ అసెంబ్లీని ప్రొరోగ్ చేసిన గవర్నర్.. సర్కార్‌కు లైన్‌ క్లియర్‌

2020 నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ జరిమానాగా రూ. 8,500 కోట్లు వసూలు చేశాయి. సమాచారం ప్రకారం.. కస్టమర్లకు కనీస బ్యాలెన్స్ పరిమితి నగరాలు, గ్రామాలలో మారుతూ ఉంటుంది. ఉదాహరణకు.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోని పట్టణ ఖాతాదారులకు సేవింగ్స్ ఖాతాలో కనీస త్రైమాసిక సగటు బ్యాలెన్స్ రూ. 2,000. పట్టణాలకు రూ.1000, గ్రామాలకు రూ.500. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే నగరాల్లో రూ.250, పట్టణాల్లో రూ.150, గ్రామాల్లో రూ.100 వరకు మినహాయించుకోవచ్చు.

READ MORE:Friends Rape: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై స్నేహితుల సామూహిక అత్యాచారం.. హోటల్ కు తీసుకుని వెళ్లి..

ఏ బ్యాంక్ ఎక్కువ సంపాదించింది..
ఖాతాలు తెరిచే సమయంలో బ్యాంకులు కనీస నిల్వల గురించి వినియోగదారులకు తెలియజేయాలని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చెప్పారు. SBI 2019-20లో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ ద్వారా రూ.640 కోట్లు సంపాదించింది. అయితే ఆ తర్వాత బ్యాంకు ఈ విధానాన్ని నిలిపివేసింది. 2023-24లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ పెనాల్టీ ద్వారా రూ.633 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.387 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.369 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.284 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.194 కోట్లు ఆర్జించాయి.

Exit mobile version