గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గూగుల్ యూజర్ల కోసం జీసూట్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జీసూట్ యూజనర్ల సౌలభ్యం కోసం కరెంట్స్‌ను తీసుకొచ్చింది. అయితే, ఈ కరెంట్స్ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో మూసివేయాలని నిర్ణయించుకున్నది. 2019 లో కరెంట్స్‌ను తీసుకొచ్చారు. మూడేళ్ల సేవల అనంతరం గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. 2023లో కరెంట్స్‌ను పూర్తిగా మూసివేయనున్నట్టు గూగుల్ పేర్కొన్నది. కరెంట్స్‌లోని అన్ని ఫీచర్స్‌ను గూగుల్ స్పేస్‌కు జోడిస్తామని తెలియజేసింది. అంతేకాదు, గూగుల్ స్పేస్‌లో మరిన్ని సేవలను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఆ సంస్థ తెలియజేసింది. గతంలో గూగుల్ మెయిల్ ఇన్ బాక్స్ ద్వారా చాట్ చేసుకునే సౌకర్యాన్ని కొనసాగించనున్నది. వీటితో పాటు యూజర్లకు కావాల్సిన కొన్ని ఫీచర్లను కూడా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు గూగుల్ సంస్థ తెలియజేసింది.
Read: Potato Milk: ఆలుగడ్డలతో పాలు… ఎగబడుతున్న లండన్ వాసులు…