మళ్లీ పసిడి ధరలు పైకి ఎగబాకుతున్నాయి.. మొన్నటి వరకు కాస్త దిగివచ్చినట్టు కనిపించిన బంగారం ధరలు.. గురువారం నుంచి మళ్లీ పైకి కదులుతూ.. పసిడి ప్రేమికులు బ్యాడ్ న్యూస్ చెబుతున్నాయి.. బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170 పెరిగి రూ.54,820కి చేరితే.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 150 మేర పైకి కదిలి రూ.50,250కి చేరింది.. ఈ రోజు భారతీయ మార్కెట్లలో బంగారం మరియు వెండి ధరలు మిశ్రమ పోకడలను చూపించాయి. ఫిబ్రవరి, 2023లో మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ రూ. 25 లేదా 0.05 శాతం క్షీణించి, 10 గ్రాములకు రూ. 54,521 వద్ద ట్రేడ్ అవుతోంది.. మరోవైపు, మార్చి 3, 2022న మెచ్యూర్ అయ్యే వెండి ఫ్యూచర్స్, రూ. 220 లేదా 0.32 శాతం పెరిగి, కిలోకు రూ.68,870 వద్ద రిటైల్ అవుతున్నాయి..
Read Also: Book Fair in NTR Stadium: ఎన్టీఆర్ స్టేడియంలో 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక వేడుకలు..
భారతదేశంలో, బంగారం మరియు వెండి ధరలు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. విలువైన లోహాల రేటులో గమనించిన ధోరణులను నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక, ఇవాళ్టి బంగారం వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,250గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,820గా ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.50,400గా 24 క్యారెట్ల ధర రూ.54,980గా ఉంది.. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,250గా ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.54,820 వద్ద డ్రేడ్ అవుతోంది.. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం రూ.50,250గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,820.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,240, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,900గా కొనసాగుతోంది.. ఇక, వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,700గా ఉంటే. ఢిల్లీలో రూ.70,100, ముంబైలో రూ.70,100, కోల్‌కతాలో రూ.70,100, చైన్నైలో కిలో వెండి ధర రూ.74,700గా పలుకుతోంది.