పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతాయని అంతా భావించారు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా ధరలు రివర్స్ అవుతున్నాయి. ఈ పరిమాణం సామాన్యులకు కొంత మేర ఊరట కలిగించే విషయమే. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.650 పెరగగా.. కిలో వెండిపై రూ.5,000 తగ్గింది.
తులం గోల్డ్‌పై రూ.650 పెరగడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,930 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.600 పెరగడంతో రూ.1,38,350 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.490 పెరగడంతో రూ.1,13,200 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump-Sanae Takaichi: ట్రంప్‌తో జపాన్ ప్రధాని భేటీ.. షాకింగ్ ప్రశ్నకు అసౌకర్యానికి గురైన సనాయే తకైచి
ఇక ఈరోజు కూడా సిల్వర్ ధర ఊరట కలిగించింది. కిలో వెండి ధరపై ఏకంగా రూ.5,000 తగ్గడంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.2,55, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,64,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.2,55, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Iran-Israel War: హార్ముజ్ కోసం ఏకమైన 6 దేశాలు.. నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!