పసిడి ప్రియులకు ధరలు షాకిస్తున్నాయి. ధరలు దిగొస్తాయనుకుంటే.. అందుకు భిన్నంగా పరుగులు పెడుతున్నాయి. కొద్ది రోజులుగా ధరలు పైపైకి వెళ్లిపోతున్నాయి. దీంతో గోల్డ్ లవర్స్ కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు. ప్రస్తుత ధర ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది.
ఇది కూడా చదవండి: Trump: భారత్, చైనాపై 100 శాతం సుంకం విధించండి.. ఈయూకు ట్రంప్ సూచన
బుధవారం తులం బంగారం ధర రూ.219 పెరిగింది. సిల్వర్ ధర మాత్రం ఉపశమనం కలిగించింది. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 219 పెరిగి రూ.1,10,509 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 1,01,300 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.82, 880 దగ్గర అమ్ముడవుతోంది. ఇక కిలో వెండి ధర రూ.1,30.000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.1, 40, 000 దగ్గర అమ్ముడవుతుండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.1,30,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Delhi: షోరూమ్ ఫస్ట్‌ఫ్లోర్‌లో నిమ్మకాయ తొక్కిస్తుండగా కిందపడ్డ ఖరీదైన కారు.. ఆ తర్వాత ఏమైందంటే..!