బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. రెండు రోజులు శాంతించిన ధరలు.. దీపావళి ముగియగానే తన పంథా కొనసాగిస్తోంది. మళ్లీ జెట్ స్పీ్డ్‌లా ధరలు దూసుకెళ్తున్నాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.2,080 పెరగగా.. వెండి ధర మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. కిలో వెండిపై రూ.2,000 తగ్గింది.
పసిడి ప్రియులకు ధరలు షాకిస్తున్నాయి. ధరలు దిగొస్తాయనుకుంటే.. అందుకు భిన్నంగా పరుగులు పెడుతున్నాయి. కొద్ది రోజులుగా ధరలు పైపైకి వెళ్లిపోతున్నాయి. దీంతో గోల్డ్ లవర్స్ కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు. ప్రస్తుత ధర ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది.