సంక్రాంతికి కూడా వెండి ధర తగ్గేదేలే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తోంది. పండగ సమయంలోనైనా తగ్గుతుందేమోనని అనుకుంటే.. ఈరోజు కూడా భారీగా పెరిగిపోయింది. నిన్న రూ.3 లక్షల మార్కు దాటి రికార్డ్ బద్ధలు కొట్టగా.. తాజాగా మరో రికార్డ్ దిశగా దూసుకుపోతుంది. కిలో వెండిపై రూ.5,000 పెరిగింది. దీంతో రికార్డ్ స్థాయిలో అమ్ముడవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.3,10,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక బంగారం ధర మాత్రం కాస్త ఉపశమనం కలిగింది.
ఇది కూడా చదవండి: Trump: మా బెదిరింపులతో ఇరాన్లో హత్యలు ఆగాయి.. ట్రంప్ ప్రకటన
ఈరోజు ఏకంగా కిలో వెండిపై రూ.5,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,95, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,10,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,95, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Zubeen Garg: జుబీన్ గార్గ్ మృతిపై సింగపూర్ పోలీసులు సంచలన రిపోర్ట్.. ఏం తేల్చారంటే..!
ఇక ఈరోజు బంగారం ధర ఉపశమనం కలిగించింది. తులం గోల్డ్‌పై రూ.820 తగ్గి బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,180 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.750 తగ్గి రూ.1,31,250 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.610 తగ్గి రూ.1,07,390 దగ్గర ట్రేడ్ అవుతోంది.