భారత్ మార్కెట్లో ఎప్పుడూ పసిడికి డిమాండ్ ఉంటుంది.. ధర పెరిగినా.. తగ్గినా.. బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి.. ఇక, పండుగలు, పెళ్లిళ్ల సీజన్ అయితే.. పసిడి కొనుగోళ్లు పెద్దస్థాయిలో ఉంటాయి.. రెండు రోజులు పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. వినాయక చవితి ముందు పసిడి ప్రేమికులకు గుడ్న్యూస్ చెప్పాయి.. ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గింది.. దీంతో.. రూ.47,150కు దిగివచ్చింది.. ఇక, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170 తగ్గి రూ.51,430కి పరిమితమైంది.. మరోవైపు.. వెండి కూడా బంగారం దారి పట్టింది.. రూ. 700 తగ్గడంతో కిలో వెండి ధర రూ.60 వేలకు క్షీణించింది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, ఆంధ్రప్రదేశ్లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.47,150కి దిగిరాగా.. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.170 తగ్గడంతో రూ.51,430కి పరిమితమైంది.. కిలో వెండి ధర రూ.60 వేలుగా నమోదైంది.. ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో రూ.47,700.. ముంబైలో రూ.47,150, ఢిల్లీలో రూ.47,300, కోల్కతాలో రూ.47,150, బెంగళూరులో రూ.47,200, కేరళలో రూ.47,150, పుణెలో రూ.47,180, మంగళూరులో రూ.47,200, మైసూర్లో రూ.47,200గా ఉంది. ఇక, 24 క్యారెట్ల బంగారం ధర చెన్నై- రూ. 52,040, ముంబై- రూ. 51,430, ఢిల్లీ- రూ. 51,600, కోల్కతా- రూ. 51,430, బెంగళూరు- రూ. 51,490, కేరళ- రూ. 51,430, పూణె- రూ. 51,460, మంగళూరు – రూ. 51,490, మైసూర్- రూ. 51,490గా ఉన్నాయి..