Fastag: వాహనాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ కొత్త ధరలు..
- ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంపు..
- ఏప్రిల్ 1 నుంచి పెంచిన ధరలు అందుబాటులోకి..
- రూ.3 వేల నుంచి రూ.3075 చేరిన కొత్త ధర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రైవేట్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక సమాచారాన్ని అందించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను సవరించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయించింది. ప్రస్తుతం వార్షిక పాస్ ధర రూ. 3,000గా ఉండగా.. ఏప్రిల్ 1, 2026 నుంచి ఇది 2.5 శాతం పెరిగి రూ. 3,075 కానుంది. రహదారుల నిర్వహణ , టోల్ రేట్ల వార్షిక సమీక్షలో భాగంగా ఈ పెంపును చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఇప్పటికీ పాత ధరకే అంటే రూ. 3,000కే పాస్‌ను పొందాలనుకునే వాహనదారులు.. ఈ నెలాఖరు (మార్చి 31) లోపు రీఛార్జ్ చేసుకోవాలని సూచించారు.
Also Read:Twin Sister: తోడబుట్టిన చెల్లి అని కూడా చూడలేదు.. 40 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..
Also Read
- Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
- JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
- Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్‌ను దాటిన డాలర్ విలువ!
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
ఈ వార్షిక పాస్ కేవలం ప్రైవేట్ (నాన్-కమర్షియల్) వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పాస్ ఒక సంవత్సరం కాలపరిమితి వరకు ఉంటుంది లేదా గరిష్టంగా 200 టోల్ ప్లాజాల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంటే ఏడాది పూర్తికాక ముందే 200 టోల్ ప్లాజాలను దాటితే.. పాస్ గడువు ముగిసినట్లుగా పరిగణించబడుతుంది. టోల్ గేట్ల వద్ద ఆగకుండా.. ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా ప్రయాణించడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 52 లక్షల మందికి పైగా వాహనదారులు దీనిని వినియోగించుకుంటున్నారు.
Also Read:SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..
పాస్ పొందడం ఎలా..?
మీ వాహనానికి యాక్టివ్ ఫాస్టాగ్ ఉన్నట్లయితే, మీరు సులభంగా యాన్యువల్ పాస్ పొందవచ్చు. ముందుగా NHAI అధికారిక పోర్టల్‌లోకి లేదా మీ ఫాస్టాగ్ ఇష్యూ చేసిన బ్యాంక్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి. ‘యాన్యువల్ పాస్’ ఆప్షన్‌ను ఎంచుకుని.. ఆన్లైన్ పేమెంట్ ద్వారా నిర్ణీత ఫీజును చెల్లించండి. చెల్లింపు పూర్తయ్యాక, పాస్ మీ ఫాస్టాగ్ ఖాతాకు లింక్ అవుతుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాలకు ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రేట్లను అమలు చేయాలని ఇప్పటికే సూచనలు జారీ చేశారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి.. వీలైనంత త్వరగా రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అదనపు భారాన్ని తగ్గించుకోవచ్చు.
తాజావార్తలు
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్‌లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్‌కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..