Bitcoin Price Drop: ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ ధర క్రమంగా తగ్గుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఘోరంగా క్రాష్ అవుతుందని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ ధర $90,000 కంటే తక్కువగా ఉంది. కేవలం గత 24 గంటల్లో క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ $130 బిలియన్లు (దాదాపు ₹12 లక్షల కోట్లు) కోల్పోయింది. ఈ స్టోరీలో బిట్‌కాయిన్ ధరల ప్రస్తుత స్థాయి, మొత్తం క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ను తెలుసుకుందాం.
READ ALSO: Palnadu District: నల్లగా ఉందని వదిలేసిన భర్త.. అత్త ఇంటి ముందు ఆందోళనకు దిగిన భార్య
బిట్‌కాయిన్ పతనం.. తుడిచిపెట్టుకునిపోయిన $130 బిలియన్లు..
బిట్‌కాయిన్ డిసెంబర్ 15న $89,608 వద్ద ట్రేడవుతోంది. ఇది మార్కెట్‌లో గత 24 గంటల్లో 0.60% తగ్గుదల నమోదు చేసింది. ఈ కారణంగా మొత్తం క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ $130 బిలియన్లకు పైగా (దాదాపు ₹12 లక్షల కోట్లకు) తగ్గింది. దీంతో మొత్తం క్రిప్టో మార్కెట్ క్యాప్ రూ.3 లక్షల కోట్లు లేదా $2.98 ట్రిలియన్ల కంటే తక్కువకు పడిపోయింది. ఈ రోజు ఉదయం సెషన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ $87,996కి పడిపోయి $89,923 కంటే కొంచెం ఎక్కువ గరిష్ట స్థాయికి చేరుకుంది.
డెల్టా ఎక్స్ఛేంజ్ మార్కెట్ విశ్లేషకురాలు రియా సెహగల్ మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 116,000 మంది వ్యాపారులు తమ ట్రేడింగ్‌లను ముగించారని, దీంతో మొత్తం నష్టాలు $295 మిలియన్లకు మించిపోయాయని అన్నారు. ఈ నష్టాలు అనేవి ఇది అధిక లివరేజ్, బలహీనమైన మార్కెట్ సెంటిమెంట్‌ను సూచిస్తుందని చెప్పారు. బిట్‌కాయిన్ $87,500 – $91,000 మధ్య స్థిరంగా ఉందని, ఇది బేరిష్ సెంటిమెంట్‌ను సూచిస్తుందని పేర్కొన్నారు. అయితే Ethereum $2,900 – $3,180 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతోందని వెల్లడించారు. ఇది దాని జీవితకాల గరిష్ట స్థాయి కంటే దాదాపు 37.5% తక్కువగా ట్రేడవుతోందని చెప్పారు.
ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా అస్థిరతను ఎదుర్కుంటున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత 24 గంటల్లో Ethereum ETHలో 0.23 శాతం పెరుగుదల, ADAలో 0.73 శాతం తగ్గుదల, SOLలో 0.21 శాతం తగ్గుదల, XRPలో 0.82 శాతం పెరుగుదల, BNBలో 0.50 శాతం తగ్గుదల కనిపించిందని చెప్పారు. $90,000 మద్దతు స్థాయిని పట్టుకోవడంలో బిట్‌కాయిన్ వైఫల్యం, బ్యాంక్ ఆఫ్ జపాన్ విధానంలో మార్పును సూచిస్తుందని, ఇది చారిత్రాత్మకంగా ప్రపంచ ద్రవ్యతను తగ్గిస్తుందని సెహగల్ పేర్కొన్నారు.
READ ALSO: ISIS Australia Link: నిఘా సంస్థలను మోసం చేసిన సిడ్నీ కసాయి..