LPG Price Hike: నూతన సంవత్సరం ప్రారంభమైంది. మొదటి రోజే బిగ్ షాక్ వచ్చింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG సిలిండర్ల ధరలను పెంచాయి. జనవరి 1, 2026 నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాలతో సహా దేశవ్యాప్తంగా రేట్లు పెరిగాయి. చమురు కంపెనీలు వాణిజ్య( కమర్షియల్) LPG సిలిండర్ల ధరలను రూ. 111 పెంచాయి. కానీ.. 14 కిలోల దేశీయ LPG గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. అంటే మన ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్ ధర యాథావిథిగా ఉంది. పెరిగిన కమర్షియల్ సిలిండర్ల కొత్త రేట్లు జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. ఢిల్లీలో ఇప్పటివరకు రూ.1580.50కి లభించిన 19 కిలోల వాణిజ్య సిలిండర్ ఇప్పుడు రూ.1691.50కి అందుబాటులో ఉంటుంది. కోల్‌కతాలో దీని ధర రూ.1684 నుంచి రూ.1795కి పెరిగింది. చెన్నై, హైదరాబాద్‌లోనూ ధరలు పెరిగాయి.
READ MORE: Psych Siddharth : డబ్బు కంటే గౌరవమే ముఖ్యం అంటున్న హీరో నందు!
కాగా.. గత కొన్ని నెలలుగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తరచుగా మారుతూ వస్తున్నాయి. గతేడాది తగ్గుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గతేడాది డిసెంబర్‌లో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించారు. ఢిల్లీ, కోల్‌కతాలో రూ.10 తగ్గించగా, ముంబై, చెన్నైలలో రూ.11 తగ్గించారు. డిసెంబర్ 2025 లో మాత్రమే కాదు, అంతకుముందు నవంబర్ మొదటి తేదీన కూడా వాణిజ్య LPG సిలిండర్ ధర తగ్గించారు.
READ MORE: Hyderabad: “కానిస్టేబుల్ నన్ను కొట్టిండు”.. మద్యం మత్తులో రోడ్డుపై పడుకుని వ్యక్తి హల్చల్