Business Flash: దటీజ్ ఇండియన్ ఎకానమీ. కనిపించని ప్రపంచ అనిశ్చితుల ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Flash: 17 ఐపీఓలతో 6 బిలియన్ డాలర్లు
మన ఎకానమీ ఎంత బలోపేతంగా ఉందో చెప్పే సందర్భమిది. ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్ధంలోనే సంఘటిత రంగంలో 1149 ఒప్పందాలు కుదిరాయి. ఈ డీల్స్ వీటి విలువ ఏకంగా 104.3 బిలియన్ డాలర్లు కావటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నా వాటి ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ పైన ఏమాత్రం లేవనటానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే కేవలం 17 ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్(ఐపీఓ)తోనే 6 బిలియన్ డాలర్లు పోగయ్యాయి. తొలి ఆరు నెలల్లో ఇదే అత్యధిక ఇన్వెస్ట్‌మెంట్ కావటం గమనార్హం.
Also Read
- Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
- UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
- Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
- Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
130 బిలియన్ డాలర్ల నష్టం
అమెరికా సోషల్ మీడియా కంపెనీలకు నిన్న శుక్రవారం ఒక్క రోజే 130 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఆయా సంస్థల స్టాక్ మార్కెట్ విలువ భారీగా తగ్గింది. ట్విట్టర్, స్నాప్ కంపెనీల ఫలితాల వెల్లడి తర్వాత ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ ఆదాయాలపై మార్కెట్ ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన మొదలైంది. దీంతో ‘స్నాప్’ షేర్లు 39 శాతం పడిపోయాయి. 2020 మార్చి అనంతరం ఇదే కనిష్టం. ఆల్ఫాబేట్ స్టాక్స్ 5.6 శాతం క్షీణించాయి. గడచిన రెండేళ్లలో ఇదే అత్యధిక ‘ఒక్క రోజు నష్టం’ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
read also: Governor Tamilisai: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. ప్రాథమిక చికిత్స చేసిన గవర్నర్
ఊపందుకున్న రియల్ ఎస్టేట్ రంగం
దేశవ్యాపంగా స్థిరాస్తి వ్యాపారం కొవిడ్ ప్రభావం నుంచి బాగానే కోలుకుంది. ఈ రంగంలోకి పెట్టుబడులు భారీఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి 6 నెలల్లోనే 3.4 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయి. గతేడాది చివరి మూడు నెలలు, ఈ ఏడాది మొదటి మూడు నెలలతో పోల్చితే ఇది 42 శాతం ఎక్కువ. 2021 ప్రథమార్ధం కన్నా 4 శాతం అధికం. సీబీఆర్‌ఈ ఇండియా మార్కెట్ మానిటర్ 2022 రెండో త్రైమాసికం నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. సీబీఆర్‌ఈ అంటే కోల్డ్‌వెల్ బ్యాంకర్ రిచర్డ్ ఎల్లిస్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ. దీనికి మన దేశంలోనూ బ్రాంచ్ ఉంది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!