ప్రపంచంలో ఎన్ని రకాల కమ్యూనిటీలు ఉన్నాయో.. అన్ని రకాల సంప్రదాయాలూ ఉన్నాయి. ప్రతి దేశంలో వివిధ రకాల ఆచారాలను అనుసరించే వివిధ వర్గాలు, తెగల ప్రజలు కనిపిస్తారు. వీటిలో కొన్ని సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. కొన్ని దుష్ట పద్ధతులు నేటికీ కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని ఒక తెగకు చెందిన ప్రజలు పురాతన కాలం నుంచి అనుసరిస్తున్న అలాంటి ఒక చెడు ఆచారం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం..
READ MORE: Liam Livingstone: లివింగ్‌స్టోన్ ఊచకోత.. ఒకే ఓవర్‌లో 28 రన్స్
బంగ్లాదేశ్‌లోని మండి తెగ ప్రజల ఆచారం ప్రకారం.. తండ్రి తన కుమార్తె యవ్వనంలోకి రాగానే పెళ్లి చేసుకుంటాడట. ఆమె యవ్వనంలోకి వచ్చిన వెంటనే ఆమె భర్తగా మారుతాడట. అవును.. ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. ఇక్కడ తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న సంబంధం భార్యాభర్తల అనుబంధంగా మారుతుంది. బంగ్లాదేశ్‌లోని మండి తెగకు సంబంధించిన సంప్రదాయం ఒక దుష్ట పద్ధతిలా మారింది. నిజానికి ఇక్కడి పురుషులు వితంతువులైన స్త్రీలను చిన్నవయసులోనే పెళ్లి చేసుకుంటారు. ఒక పురుషుడు తనకన్నా చిన్న వయసున్న వితంతువును పెళ్లి చేసుకుంటే.. ఆమెకు మొదటి వ్యక్తితో పుట్టిన కూతుర్ని కూడా తర్వాత పెళ్లి చేసుకోవచ్చని ఈ ఆచారం చెబుతోంది. కానీ.. ఆ పురుషుడు “తన సొంత కుమార్తెను మాత్రం పెళ్లి చేసుకోడు.” ఈ షరతు చాలా ముఖ్యం.
READ MORE:Viral News: రూ. 10వేల కూలీకి.. రూ.2 కోట్లకు పైగా పన్ను కట్టాలని నోటీసులు
వరుసకు “స్టెప్ డాటర్” అయిన అమ్మాయిని వరుసకు తండ్రి అయిన వ్యక్తి పెళ్లి చేసుకోవడం వంటి ఆచారం వింతగా అనిపిస్తుంది. తాను వివాహం చేసుకునే అమ్మాయి అతని నిజమైన కుమార్తె కాదని భావిస్తారు. ఈ వింత దురాచారం వెనుక ఒక కారణం ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అదేమిటంటే.. ఒక స్త్రీ చిన్న వయస్సులోనే వితంతువుగా మారినప్పుడు.. తనకు కుమార్తె ఉన్నప్పుడు.. ఆమె చిన్న అబ్బాయిని వివాహం చేసుకుంటుంది. వితంతు స్త్రీకి పురుషుడి మద్దతు కూడా లభిస్తుంది. అలాగే.. షరతు ప్రకారం.. పెళ్లి తర్వాత ఆమె మొదటి భర్తకు కలిగిన కుమార్తెను చేసుకుంటాడట. కుమార్తె యుక్తవయస్సు వచ్చిన వెంటనే.. తండ్రి వయసున్న వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తారట. ఆ తర్వాత కుమార్తె భార్యగా అన్ని విధులను నిర్వహిస్తుంది. అలాంటి సంప్రదాయం తల్లి, కుమార్తె ఇద్దరి భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతుందని నమ్ముతారు. వితంతు స్త్రీ బాగోగులతో పాటు ఆమె కుమార్తెను కూడా చూసుకుంటారని ఇలాంటి ఆచారం పెట్టారట. ఇప్పటికీ ఈ ఆచారం అక్కడ కొనసాగుతోంది.