ఓవైపు ప్రైవేట్ టెలికం సంస్థలు ప్లాన్ ధరలు పెంచుతూ.. యూజర్లకు షాక్ ఇస్తుంటే.. మరోవైపు ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది.. పాతవారిని కాపాడుకుంటూనే.. కొత్తవారిని ఆకర్షించేలా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది.. ప్రైవేట్ టెలికం సంస్థలు అందించిన ప్లాన్స్ రూ.200కు పైగా ఉంటున్నాయి.. ఇక, వాలిడిటీ కేవలం 28 రోజులకే పరిమితం అవుతుండగా.. కొన్ని షరతులతో రూ.197కే 150 రోజుల వ్యాలిడిటీ అందించే ప్లాన్ తీసుకొచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్..
Read Also: కోవిడ్ థర్డ్ వేవ్ ముగిసినట్టే.. 10 రోజుల్లో సాధారణ పరిస్థితి..!
ఇక, ఆ సంస్థ పెట్టిన షరతుల విషయానికి వస్తే.. రూ. 197 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 150 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది.. ఈ స్కీమ్‌లో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు కూడా ఆఫర్ చేస్తుంది.. కానీ, ఆ ప్రయోజనాల మాత్రం కేవలం 18 రోజులు మాత్రమే పొందే వీలు ఉంటుంది.. ఆ తర్వాత వ్యాలిడిటీ ఉన్నా.. కాల్స్, ఇంటర్నెట్ కోసం ప్రత్యేకంగా టాప్అప్ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.. అయితే, సుదీర్ఘ వ్యాలిడిటీ అందించమే లక్ష్యంగా ఈ సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్.. 18 రోజుల తర్వాత కూడా ఎలాంటి టాప్అప్ వేయకపోయినా ఉచిత ఇన్‌కమింగ్ సౌకర్యాన్ని పొందే వీలు ఉంటుంది.. అలాగే 40 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ కూడా అందిస్తుంది బీఎస్ఎన్ఎల్..