BSNL: దూసుకుపోతున్న బీఎస్‌ఎన్‌ఎల్.. 17ఏళ్ల తర్వాత భారీగా లాభాలు..
- బీఎస్‌ఎన్‌ఎల్‌కు మంచి రోజులు
- రూ.262 కోట్లకు పైగా లాభం
- 2007 తర్వాత పెద్ద మొత్తంలో లాభాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఎస్‌ఎన్‌ఎల్‌కు మంచి రోజులు వచ్చాయి. కంపెనీ లాభం 17 సంవత్సరాలలో మొదటిసారిగా రూ.262 కోట్లకు పైగా పెరిగింది. 2007 తర్వాత కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించలేదు. లాభాలు ఈ విధంగా పెరగడానికి కారణం వేగవంతమైన నెట్‌వర్క్ విస్తరణ, తక్కువ ధరలకు సేవలను అందించడం అని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. దేశంలో టెలికాం రంగం ప్రయాణంలో ఈ రోజు చాలా ముఖ్యమైనదని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ప్రధానమంత్రి నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. “భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు టెలికాం రంగం కీలక స్తంభంగా మారాలని ప్రధానమంత్రి ఆకాంక్షిస్తున్నారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లందరూ ఈ లక్ష్యం కోసం నిజాయితీగా పనిచేస్తున్నారు. డిజిటల్ యుగంలో భారతదేశ టెలికాం రంగం కొత్త శిఖరాలకు చేరుకోవడానికి ప్రధానమంత్రి దార్శనికత కారణం..” అని మంత్రి పేర్కొన్నారు.
READ MORE: Anji Reddy Chinnamile: నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ఓట్లతో బుద్ధి చెప్పాలి
Also Read
- Zepto: దలాల్ స్ట్రీట్‌లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
- Life Insurance Mistakes: లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ 5 తప్పులు చేయకండి!
- Nifty 50: రికవరీ దిశలో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 25,000 మార్క్‌ను దాటుతుందా..?
- Gold Coins-Gold Bars: గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్ కొంటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఎ. రాబర్ట్ మాట్లాడారు. “ఈ త్రైమాసికంలో మా ఆర్థిక పనితీరు పట్ల మేము సంతోషంగా ఉన్నాం. నెట్‌వర్క్ విస్తరణ, తక్కువ ధర, కస్టమర్లకు సరైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాం. ఈ ప్రయత్నాలతో విజయం సాధించాం. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆదాయ వృద్ధి 20% కంటే ఎక్కువగా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. రూ. 262 కోట్ల రూపాయల లాభం ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ మెరుగుపడుతూ.. స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుందని స్పష్టమైంది. కంపెనీ ఆర్థిక ఖర్చులు, మొత్తం వ్యయాన్ని కూడా తగ్గించుకుంది. దీనివల్ల గత సంవత్సరంతో పోలిస్తే నష్టాలు రూ. 1,800 కోట్లకు పైగా తగ్గాయి. టెల్కో తన మొబిలిటీ సేవల ఆదాయం 15% పెరిగింది. ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) ఆదాయం 18% లాభం వచ్చింది. లీజుకు ఇచ్చిన లైన్ సేవల ఆదాయం కూడా 14% పెరిగింది.” అని ఆయన తెలిపారు.
READ MORE: Lalit Modi: వాలంటైన్స్ డే రోజున మరో కొత్త ప్రేయసిని పరిచయం చేసిన లలిత్ మోడీ
తాజావార్తలు
-
RCB vs GT: వర్షం వల్ల క్వాలిఫయర్-1 రద్దయితే ఫైనల్ చేరేది ఎవరు.! రూల్స్ ఏమంటున్నాయంటే.?
-
AP Government: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. బిజినెస్ రూల్స్ మార్పులకు సీఎం ఆదేశాలు
-
Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ రిలీజ్.. సమంత పవర్ఫుల్ యాక్షన్ హైలైట్
-
Astrology: మే 26 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?