BSNL Prepaid Offer: భారత ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. BSNL తన వినియోగదారులకు రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. వాస్తవానికి టెలికాం మార్కెట్‌లోని పోటీదారులతో పోల్చితే ఈ ప్లాన్ ఇప్పటికే సరసమైన రీఛార్జ్ ప్లాన్‌గా రికార్డు సొంతం చేసుకుంది. అయినా కూడా BSNL ఇప్పుడు పండుగ ఆఫర్‌లో భాగంగా ఈ ప్లాన్‌ను మరింత సరసమైనదిగా చేసింది. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు ఎంత ఆదా అవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: HYDRA : డిప్యూటీ సీఎం పవన్ తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ.. సర్వత్రా ఉత్కంఠ
BSNL 199 ప్లాన్ వివరాలు..
BSNL రూ.199 ప్లాన్‌తో రీఛార్జి చేయిస్తే రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లు వస్తాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే రూ.200 కంటే తక్కువ ధరకు లభించే 28 రోజుల చెల్లుబాటుతో రోజుకు 2GB డేటాను అందించే మరే ఇతర ప్లాన్ పోటీ కంపెనీల నుంచి లేదు. తాజాగా BSNL కొత్త డిస్కౌంట్ ప్లాన్ గురించి (ఎక్స్)ట్విట్టర్‌లో పోస్ట్ ద్వారా పంచుకుంది. ఈ BSNL ప్లాన్ అన్ని BSNL సర్కిల్‌లలోని వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని, పండుగ ఆఫర్‌లో భాగంగా ఇది 2.5% తక్షణ తగ్గింపుతో వస్తుందని వెల్లడించింది.
నవంబర్ 18 వరకు మాత్రమే
వినియోగదారులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఆఫర్ కేవలం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 18, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంది, అలాగే చెల్లుబాటు అవుతుందని BSNL పేర్కొంది. వినియోగదారులకు రూ.199 రీఛార్జ్ పై 2.5% తగ్గింపు అంటే రూ. 4.97 ఆదా అవుతుంది. డిస్కౌంట్ పొందిన తర్వాత ఈ ప్లాన్ మీకు రూ.194.02 కు వస్తుంది. X లో షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రకారం.. రూ.199 ప్లాన్‌పై డిస్కౌంట్ పొందడానికి వినియోగదారులు BSNL సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగించి చేసే రీఛార్జ్‌లపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండదనే విషయాన్ని వినియోగదారులు తెలుసుకోవాలి.
READ ALSO: Redmi Projector 4 Pro: రెడ్‌మి నుంచి కొత్త ప్రొజెక్టర్ లాంచ్.. ఇక టీవీతో పని లేదు!