బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఎవరి అజమాయిషిలో లేని క్రిప్టోకరెన్సీలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లకు అనుగుణంగా బిట్ కాయిన్ లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా ఈక్విటీ మార్కెట్ పుంజుకోగా దానికి అనుగుణంగా బిట్ కాయిన్ విలువ గరిష్టానికి చేరుకుంది. గురువారం నుంచి ఇప్పటి శనివారం వరకు బిట్ కాయిన్ విలువ 16శాతం మేర పెరిగింది. బిట్ కాయిన్‌తో పాటు బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి అనుసంధనమైన ఈథర్ కాయిన్ విలువ కూడా పెరిగింది. బిట్ కాయిన్ విలు శనివారానికి 41,983 డాలర్లుకు చేరుకోగా, ఈథర్ కాయిన్ విలువ 3 వేల డాలర్లకు చేరుకుంది.
Read: పార్టీ పగ్గాల అప్పగింతపై లాలూ కీలక వ్యాఖ్యలు…
ఒక్క శుక్రవారం రోజునే ఏకంగా 11 శాతంమేర ఎగబాకింది. అమెరికా మార్కెట్లు ఈ వారం లాభాల బాట పట్టడంతో బిట్‌కాయిన్ విలువ కూడా భారీగా పెరిగింది. బిట్ కాయిన్‌ను మదుపర్లు అసెట్ క్లాస్‌గా చూడటంతో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని, స్టాక్ మార్కెట్లు పడిపోయినపుడు బిట్‌కాయిన్‌ను అమ్ముతున్నారని నిపుణులు చెబుతున్నారు.