Bitcoin Crash: ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ ధర గత కొంతకాలంగా బాగా పడిపోతోంది. ఇది రికార్డు గరిష్ట స్థాయి నుంచి 30 శాతానికి పైగా నష్టపోయింది. అక్టోబర్ 2025 ప్రారంభంలో ఒక బిట్‌కాయిన్ ధర $126,000 ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు $82,000కి పడిపోయింది. కేవలం ఈ నెలలోనే బిట్‌కాయిన్ 21 శాతానికి పైగా పడిపోయింది. గత మూడు సంవత్సరాలలో ఇది అతిపెద్ద నెలవారీ క్షీణతగా మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇంతటి క్షీణత బిట్‌కాయిన్‌కు ఎందుకు సంభవిస్తోంది, క్రిప్టో మార్కెట్లో బిట్‌కాయిన్ శకం ముగిసిందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: New Districts In AP: మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకూ గ్రీన్ సిగ్నల్..!
క్రిప్టో మార్కెట్లో బిట్‌కాయిన్ పతనానికి కారణాలు ఏంటి..
పలువురు నిపుణులు బిట్‌కాయిన్ క్షీణతకు అనేక కారణాలను పేర్కొంటున్నారు. ఇది కేవలం లాభాల బుకింగ్ మాత్రమే కాదని, ఫెడ్ రేటు తగ్గింపు, బలమైన డాలర్ అంచనాలు, క్రిప్టో మార్కెట్‌లో అతిపెద్ద కరెన్సీ క్షీణతకు దారితీసినట్లు తెలిపారు.
* ఫెడరల్ రిజర్వ్ రేట్లను తగ్గించడంలో విఫలమైతే అది బిట్‌కాయిన్‌పై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రజలు తమ నిధులను బిట్‌కాయిన్ వంటి ఆస్తుల నుంచి మరింత స్థిరమైన ఆస్తులకు మారుస్తారని వెల్లడించారు. అలాగే డాలర్ బలపడుతోందని, ఇది బిట్‌కాయిన్‌కు ప్రతికూల సంకేతం అని పేర్కొన్నారు. ఎందుకంటే డాలర్ బలపడినప్పుడు, పెట్టుబడిదారులు బిట్‌కాయిన్ నుంచి డబ్బును ఉపసంహరించుకోవాలని చూస్తారని తెలియజేశారు. బిట్‌కాయిన్ క్షీణత సమయంలో పెట్టుబడిదారులు కూడా పెద్ద ఎత్తున బిట్‌కాయిన్ ETFల నుంచి డబ్బును ఉపసంహరించుకుంటున్నారని విశ్లేషకులు తెలిపారు. దీంతో బిట్‌కాయిన్‌లోకి ఇన్‌ఫ్లోలు తగ్గుతున్నాయని వెల్లడించారు.
చాలా మంది వ్యాపారులు లివరేజ్‌ని ఉపయోగిస్తారని, బిట్‌కాయిన్ పడిపోయినప్పుడు, వారి లాంగ్ పొజిషన్‌లు మూసివేస్తారని తెలిపారు. ఈ లిక్విడేషన్‌లు, ఆటో-సెల్ ఆర్డర్‌లు క్యాస్కేడ్ ప్రభావాన్ని సృష్టించగలవని, క్షీణతను మరింత తీవ్రతరం చేస్తాయని విశ్లేషకులు తెలిపారు. ఇంకా చాలా మంది పెద్ద బిట్‌కాయిన్ వ్యాపారులు లాభాలను ఆర్జిస్తున్నారని, దీంతో లాభాల బుకింగ్ జరిగినప్పుడు బిట్‌కాయిన్ క్షీణిస్తుందని పేర్కొన్నారు.
బిట్‌కాయిన్ భవిష్యత్తు ముగిసిపోతుందా..
చాలా మంది నిపుణుల అభిప్రాయంలో ఇది సాధారణ దిద్దుబాటుగా పేర్కొంటున్నారు. దీని అర్థం క్రిప్టో మార్కెట్లో బిట్‌కాయిన్ పూర్తిగా క్రాష్ అవుతుందని కాదని చెప్పారు. కానీ అది ఎంత తగ్గుతుందో లేదా ఎప్పుడు పెరుగుతుందో అంచనా వేయడం కష్టం అని వెల్లడించారు. లిక్విడేషన్, పెద్ద హోల్డర్ల అమ్మకాలు, ETF అవుట్‌ఫ్లోలు వంటి అంశాల కారణంగా బిట్‌కాయిన్ నష్టాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: Yashasvi Jaiswal: సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన జైస్వాల్..