యాపిల్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ జారీ చేసింది. కంపెనీకి చెందిన ఐఫోన్స్, మ్యాక్స్, యాపిల్ వాచీలు ఉపయోగించేవారిని కేంద్రం అలర్ట్ చేసింది. యాపిల్ డివైజ్‌ల్లో పాత సాఫ్ట్‌వేర్‌లో అనేక భద్రతా లోపాలను హైలైట్ చేస్తూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది.
Apple Warning: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌లలో భద్రతాపరమైన లోపాలు తలెత్తవచ్చని టెక్ దిగ్గజం యాపిల్ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఈ పరికరాలను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకునే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ లోపాల అంశంపై వచ్చిన నివేదికపై తమకు పూర్తిగా అవగాహన ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు భద్రతా లోపాలపై యాపిల్ రెండు నివేదికలను విడుదల చేసింది. సఫారీతో పాటు యాపిల్ బ్రౌజర్…