Apple Hebbal: దక్షిణ భారతదేశంలో ఆపిల్ తన మొదటి ఆపిల్ స్టోర్‌ని ప్రారంభించింది. మంగళవారం రోజు బెంగళూర్ నగరంలో ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో ఆపిల్ కంపెనీ తన పూర్తి యాజమాన్యంలో రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. దీనిని ‘‘ఆపిల్ హెబ్బాల్’’గా పిలుస్తారు.
iPhone 16 Pro: ఐఫోన్ అభిమానులకు క్రేజీ ఆఫర్ ను తీసుక వచ్చింది జియోమార్ట్. ఎప్పటినుంచో iPhone 16 Pro కొనాలనుకుంటున్నా.. ధర ఎక్కువగా ఉందని వెనకడుగు వేసిన వారికి శుభవార్త అనే చెప్పాలి. ప్రముఖ రిటైల్ ప్లాట్ ఫామ్ జియోమార్ట్ ఇప్పుడు iPhone 16 Pro పై ఏకంగా రూ.19,701 వరకు భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. కొత్తగా ఫోన్ మార్చాలనుకుంటున్నా, లేదా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి మారాలనుకుంటున్నా ఈ ఆఫర్ బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖతార్ పర్యటనలో ఉన్న ఆయన పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో ఆపిల్ కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు భారతదేశంలో నిర్మించడం ఇష్టం లేదు’’ అని అన్నారు. ‘‘భారతదేశం తమను తాము చూసుకోగలదు. వారు బాగా పనిచేస్తున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, చైనా మధ్య తీవ్రతరమవుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్ల తయారీని పూర్తిగా భారత్ కు తరలించాలని యోచిస్తోంది.భారత్‌లో ఐఫోన్ల తయారీ కేంద్రంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే ఐఫోన్లను భారత్‌లో తయారు చేయాలని ప్రణాళికలు సిద్ధ చేస్తోంది. తాజాగా ఈ అంశాలపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందించారు.