NTV Telugu Site icon

Apple stores: భారత్‌లో మరో 4 ఆపిల్ రిటైల్ స్టోర్లు.. ఎక్కడెక్కడంటే..!

Applestores

Applestores

ఆపిల్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రపంచ దిగ్గజ సంస్థ భారత్‌లో తన సేవలను విస్తరించేందుకు యోచిస్తోంది. ఇందులో భాగంగా భారతదేశంలో మరో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ యోచిస్తోందని తెలుస్తోంది. బెంగుళూరు, పూణె, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైలో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ ఆలోచన చేస్తోంది.

ఇది కూడా చదవండి: CM Chandrababu: ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష.. ఆదాయం పెంచేలా చూడండి..!

ప్రపంచవ్యాప్తంగా ఆపిల్‌ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. అందుకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచేలా కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. దేశీయంగా ఆపిల్‌ ఉత్పత్తుల తయారీ కోసం ఫాక్స్‌కాన్‌, టాటా వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్‌ 20న ఆపిల్‌ ఐఫోన్‌ 16 సిరీస్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశంలోని ముంబై, ఢిల్లీ స్టోర్‌ల్లో భారీగా వినియోగదారుల రద్దీ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని కంపెనీ రెవెన్యూ పెంచుకోవాలని ఆశిస్తుంది. దేశంలో కొత్తగా బెంగళూరు, పుణె, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబైలో రిటైల్‌ స్టోర్‌లు ప్రారంభించాలని యోచిస్తోంది. దీంతోపాటు ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’లో భాగంగా ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ను స్థానికంగా తయారు చేయాలనే ప్రతిపాదనలున్నట్లు కంపెనీ అధికారులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: YouTube Shorts : యూట్యూబర్స్‌కి గుడ్‌న్యూస్.. షార్ట్స్‌ నిడివి పెంపు..

ఐఫోన్లను తయారు చేయడానికి ఆపిల్ ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, టాటా ఎలక్ట్రానిక్స్‌తో భాగస్వామ్యం కలిగి ఉందని నివేదిక వెల్లడించింది. ఐఫోన్ 16, 16 ప్లస్, ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్‌లకు ఫాక్స్‌కాన్ బాధ్యత వహిస్తుండగా, పెగాట్రాన్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రోలను నిర్వహిస్తోంది. టాటా ఎలక్ట్రానిక్స్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మోడల్‌లను కూడా తయారు చేయనుంది. ఈ ఐఫోన్లు భారత మార్కెట్లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయనుంది.

ఇది కూడా చదవండి: Tirumala Laddu Controversy: సుప్రీంకోర్టు తీర్పుపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు..

Show comments