ఆపిల్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రపంచ దిగ్గజ సంస్థ భారత్‌లో తన సేవలను విస్తరించేందుకు యోచిస్తోంది. ఇందులో భాగంగా భారతదేశంలో మరో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ యోచిస్తోందని తెలుస్తోంది. బెంగుళూరు, పూణె, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైలో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ ఆలోచన చేస్తోంది.