Anand Mahindra: ఫన్నీ వీడియోతో బిజినెస్ పాఠాలు.. అసలైన టీమ్ వర్క్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆనంద్ మహీంద్ర దేశంలో పేరుమోసిన వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో ఎంతోమందికి చేరువైన వ్యక్తి.. కొన్ని సార్లు ఆయన జోకులు వేస్తారు.. నవ్విస్తారు.. కొన్ని వీడియోలతో కట్టిపడేస్తారు.. ఆలోచింపజేస్తారు.. భవిష్యత్ వైపు బాటలు వేసుకునేవిధంగా సూచనలు చేస్తారు.. ఎంతో మందికి తన వంతుగా సాయం చేస్తుంటారు.. వ్యాపార విషయాలతో ఆయన ఎంత బిజీగా ఉన్నా.. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ దేశం నలుమూలలా దాగిన ప్రతిభను ప్రోత్సహిస్తూ ఉంటారు.. మంచి బిజినెస్ పాఠాలను కూడా చెబుతుంటారు. తాజాగా, ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసిన మహీంద్ర… వీకెండ్ ముగిసింది.. వారం ప్రారంభమైంది.. ఈ సమయంలో.. ఆనంద మహీంద్ర చేసిన ట్వీట్.. కొంత ప్రేరణ కల్పించేవిధంగా ఉంది.. టీమ్ వర్క్‌కు ఉన్న ప్రాధాన్యతను వివరించేలా ఉన్న ఆ ఫన్నీ వీడియోతో అందరినీ ఆలోచింపజేశారు.
Read Also: YS Jagan: నేను లేకుంటే గౌతమ్ రాజకీయాల్లోకి వచ్చే వాడు కాదేమో..
Also Read
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
- Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
- Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్‌గా థాయ్‌లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
- Govt Hikes Price: ఉల్లి రైతులకు భారీ శుభవార్త.. రైతుల పంట పండినట్లే..
ఇక, అసలు విషయానికి వస్తే.. పార్కింగ్ స్లాట్‌లో పడిఉన్న ఓ చిన్న తినుబండరం కోసం ఒక పిల్లి, రెండు కాకులు పోటీ పడుతుంటాయి.. అప్పటికే తినుబండం పిల్లి నోటికి అందేంత దగ్గర ఉంటుంది.. అయితే, రెండు కాకులు ఒక టీమ్‌గా పని చేస్తూ.. ఆ తినుబండరాన్ని తమ కంటే బలవంతమైన పిల్లికి దొరకకుండా తీసుకొని వెళ్తాయి.. ఒక పిల్లి, రెండు కాకులకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా… మీరు కనుక టీమ్ వర్క్ చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారంటూ తేల్చేస్తూ.. బిజినెస్ పాఠాలు బోధించారు.. “గుర్తుంచుకోండి… మీరు టీమ్‌గా కలిసి పని చేస్తే మీరు ఎల్లప్పుడూ మరింత ప్రభావవంతంగా ఉంటారు.. అని పేర్కొంటూ #MondayMorning హ్యాష్‌ట్యాగ్‌ని జోడించాడు. ఇక, మహీంద్రా తాజాగా చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారిపోయింది.
Remember…you’re always going to be more effective if you work collaboratively with a team.. 😊 #MondayMorning pic.twitter.com/lsKKKuJbcc
— anand mahindra (@anandmahindra) March 28, 2022
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
-
Dhanush: మరోసారి త్యాగం చేయనున్న ధనుష్?.. రజనీకాంత్ ‘జైలర్ 2’ కోసం ‘ఓం’ వాయిదా పడుతుందా?
-
Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్‌కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
-
Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!