NTV Telugu Site icon

Stock Market: స్టాక్ మార్కెట్‌‌కు ట్రంప్ జోష్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

Stockmarket

Stockmarket

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ విజయంతో దేశీయ స్టాక్ మార్కెట్‌ కళకళలాడింది. బుధవారం అగ్ర రాజ్యం ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా ట్రంప్ విజయం దిశగా దూసుకెళ్లారు. దీంతో ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నెలకొంది. ప్రారంభంలో లాభాలతో మొదలైన సూచీలు.. చివరి దాకా గ్రీన్‌లోనే కొనసాగాయి. మన మార్కెట్‌పై ట్రంప్ విజయం స్పష్టంగా కనిపించింది. తిరిగి సెన్సె్క్స్ 80 వేల మార్కు క్రాస్ చేసింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 901 పాయింట్లు లాభపడి 80, 378 దగ్గర ముగియగా.. నిఫ్టీ 270 పాయింట్లు లాభపడి 24, 484 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 84. 28 తాజా రికార్డు కనిష్ట స్థాయి దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Konda Surekha: విభజించి పాలించే మనస్తత్వం ఉన్న పార్టీ బీజేపీ.. కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు

నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, టిసిఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ అత్యధికంగా లాభపడగా.. ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, హెచ్‌యుఎల్ నష్టపోయాయి. ఐటీ ఇండెక్స్ 4 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ 2 శాతం చొప్పున పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 2 శాతం పెరిగాయి.

ఇది కూడా చదవండి: AP Drone Policy: డ్రోన్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే..

Show comments