అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్ని్కయ్యాక ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లకు మంచి జోష్ వచ్చింది. పసిడి, చమురు ధరలు దిగొస్తున్నాయి. అంతేకాకుండా ఇన్వెస్టర్లలో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ మార్కు 270. ప్రస్తుతం ట్రంప్ 280 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. మరోసారి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. తాజా ఎన్నికల ఫలితాల్లో గ్రాండ్ విక్టరీని అందుకున్నారు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ అల్లుడే కాబోతున్నారు. ఉపాధ్యక్షుడిగా జెడీ వాన్స్ ఎన్నిక కానున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ విజయంతో దేశీయ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. బుధవారం అగ్ర రాజ్యం ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా ట్రంప్ విజయం దిశగా దూసుకెళ్లారు.