Moto G13: రూ. 10,000 వరకు బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అందులో 64 GB స్టోరేజ్ ఉన్న ఫోన్ దొరుకుతుందంటే ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే కొనేయండి. అయితే ఇప్పుడు అలాంటి ఓ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఆ ఫోన్ లో 128 GB ర్యామ్ కలిగి ఉంది. అన్ని క్వాలిటీ ఉన్న ఫోన్ ఏంటనుకుంటున్నారా Motorola Moto G13. ఈ Motorola స్మార్ట్‌ఫోన్‌లో రెండు వేరియంట్‌లు ఉన్నాయి. ఒకటి 4 GB RAM / 64 GB మోడల్ ధర రూ. 9,499 ఉండగా.. మరొకటి 4 GB ర్యామ్‌తో 128 GB స్టోరేజ్‌ని అందించే వేరియంట్ ధర 9 వేల 999 రూపాయలుగా ఉంది.
Read Also: Health Tips : వర్షాకాలంలో వచ్చే అలర్జీ పోవాలంటే వీటిని తప్పక తీసుకోవాలి..
ఈ ఫోన్ లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD ప్లస్ రిజల్యూషన్ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్ మరియు 2MP డెప్త్ కెమెరా కలిగి ఉంది. ఫోన్ ముందు భాగంలో 8MP కెమెరా సెన్సార్ ఇవ్వబడింది. ఇది వీడియో కాలింగ్ మరియు సెల్ఫీకి సహాయపడుతుంది. Mali G52 GPU వేగం మరియు మల్టీ టాస్కింగ్ కోసం MediaTek Helio G85 చిప్‌సెట్‌తో గ్రాఫిక్స్ కోసం ఉపయోగించబడింది. 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 mAh శక్తివంతమైన బ్యాటరీ కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం Motorola Moto G13లో బ్లూటూత్ వెర్షన్ 5.1, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి ఫీచర్లు కలిగిఉంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు, ఫోన్‌లో AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కలిగి ఉన్నాయి.