తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ నాలుగు వారాలు పూర్తయ్యాయి. దీంతో ఐదో వారంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చారు బిగ్ బాస్.. ముందుగా చెప్పినట్లు ఉల్టా పుల్టా అనే విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు.. ఊహకు అందని విధంగా కొత్త అనేక ట్విస్ట్ లు ఇస్తున్నారు.. ఐదో వారంకు గాను హట్ బ్యూటీ శుభ శ్రీ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లింది.. ఆమె వెళ్లడంతో కొందరు ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.. నిన్నటి ఎపిసోడ్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది..
ఇక ఐదోవారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని భావించినప్పటికీ చివరికీ శుభ శ్రీ రాయగురు హోస్‌కు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. మరో కంటెస్టెంట్ గౌతమ్‌ను మాత్రం సీక్రెట్ రూమ్‌లోకి పంపించేశారు బిగ్ బాస్. అయితే ఇప్పటికీ ఐదుగురు హౌస్ నుంచి బయటికి రాగా.. కొత్తగా మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అంబటి అర్జున్, పూజా మూర్తి, అశ్విని శ్రీ, నయని పావని, భోలే షావలి ఉన్నారు.. వీరిలో కూడా సీరియల్ యాక్టర్స్ ఎక్కువగా ఉన్నారు.. మొత్తానికి హౌస్ లో సీరియల్ బ్యాచ్ ఎక్కువయ్యారు..
ఇదిలా ఉండగా.. ఐదో వారం ఎలిమినేట్ అయిన శుభ శ్రీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. హౌస్‌లో తన అందం, అభినయంతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న శుభశ్రీ హౌస్ నుంచి బయటకొచ్చింది. ఐదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా శుభశ్రీకి తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే రెమ్యునరేషన్ విషయానికొస్తే వారానికి దాదాపు రూ.2.5 లక్షలు వెనకేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు వారాల్లో దాదాపు రూ.10 లక్షలకు పైగా సంపాదించి ఉంటుందని బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.. ఏది ఏమైనా శుభశ్రీ, గౌతమ్ లవ్ ట్రాక్ ఇప్పుడే మొదలైంది.. అంతలోనే ఎలిమినేట్ అవ్వడం ఆడియన్స్ ఊహించలేక పోతున్నారు.. ఇక నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్ళిపోతారో చూడాలి..