బిగ్ బాస్ సీజన్ 5లో ఏడవ వారం ప్రియా ఎలిమినేట్ కాబోతోందనే ప్రచారం సోషల్ మీడియాలో ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. 47వ రోజు ఏం జరిగిందో తొలుత వీక్షకులకు చూపించిన నాగార్జున… 48వ రోజు విశేషాలనూ వీక్షకులతో పాటే తానూ చూడటం విశేషం. ఓ చెట్టుకు కోతి బొమ్మలను కట్టి, ఎవరి ఫోటో ఉన్న ఆ కోతి బొమ్మను తీసి వారికి క్లాస్ తీసుకున్నాడు నాగార్జున. ఇందులో భాగంగా ప్రియా ‘చెంప పగలకొడతాను’ అంటూ ఒకటికి పదిసార్లు సన్నీని అనడాన్ని నాగ్ తప్పుపట్టాడు. ఎగ్స్ ను సన్నీ లాక్కెళుతున్న క్రమంలో ప్రియా అతని మీదకు పూల కుండీని కూడా ఎత్తిన విషయాన్ని నాగ్ చెబితే కానీ సన్నీకి తెలియలేదు. ఇలా ప్రియాంకను విశ్వ తోసేసి వీడియోను, షణ్ముఖ్ డీలా పడిన వీడియో లను కూడా నాగార్జున వ్యూవర్స్ కు మరోసారి చూపించారు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో వరెస్ట్ పెర్ఫామెన్స్ సెలక్షన్ ఈ రోజు జరిగింది. విశ్వను ముగ్గురు (ప్రియాంక, జెస్సీ, ప్రియ) వరెస్ట్ పెర్ఫార్మర్ గా పేర్కొనడంతో అతను జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. రవి, విశ్వ… ప్రియాంకను ఎంపిక చేయగా, సన్నీ, కాజల్… ప్రియను వరెస్ట్ పెర్ఫార్మర్ గా సెలక్ట్ చేశారు. ఇక షణ్ముక్ సిరిని, యాని జెస్సీని, శ్రీరామ్ మానస్ ను, మానస్ షణ్ముఖ్ ను, సిరి కాజల్ ను వరెస్ట్ పెర్ఫార్మర్ గా పేర్కొన్నారు. అయితే… సన్నీ ప్రియాను వరెస్ట్ పెర్ఫార్మన్ గా ఎంపిక చేసిన సందర్భంగా నాగార్జున ఆసక్తికరమైన అంశాలను లేవనెత్తారు. ప్రియతో ఇప్పుడిప్పుడే ప్యాచప్ అవుతోందని, కానీ తప్పని పరిస్థితుల్లో ఆమె పేరు చెబుతున్నానని సన్నీ అనగానే, ప్రియా అతనికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. అలానే సన్నీ సైతం ఆమెకు ఫ్లయింగ్ కిస్ తోనే బదులిచ్చాడు. అలానే సన్నీ ప్లేట్ లోనే తాను భోజనం చేస్తున్నానని, దానిని తాను మాత్రం కడగనని ప్రియా ఆట పట్టించడం విశేషం. ఆమె ఎలిమినేట్ అవుతోందనే ప్రచారం జరుగుతున్న సమయంలోనే వీరిద్దరి మధ్య ఓ సరికొత్త ట్రాక్ మొదలు కావడం చిత్రం!!
Read Also : బిగ్‌బాస్-5: ఈ వారం ఎలిమినేట్ కానున్న ప్రియ?
దీనికి ముందు తెలుగు మాట్రిమోనియల్ తరఫున హౌస్ లోని మేల్, ఫిమేల్ బ్యాచిలర్స్ లో తమ భాగస్వామి ఎలా ఉండాలో బిగ్ బాస్ చెప్పించాడు. అలా చెప్పిన వారిలో కంపాక్ట్ బుల్ కపుల్ కింద ఇంటి సభ్యులు మాసస్ – ప్రియాంక కు ఓటు వేశారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న సమ్ థింగ్ సమ్ థింగ్ విషయంలో వీరి కంటే రవి ఎక్కువ ఆందోళన చెందుతున్నట్టు అనిపించింది. మానస్ తల్లి పద్మిని ఇలాంటి విషయాలలో చాలా పొసిసివ్ గా ఉంటారని రవి చెప్పడం విచిత్రం. అయితే ఇది ఓ షోలో జరుగుతున్న తంతుగానే తాను చూస్తానని, ఆమె కూడా దీనిని సీరియస్ గా తీసుకోరనే నమ్మకం తానకుందని ప్రియాంక తెలివిగా బదులిచ్చింది. అదే క్లారిటీ చూసే వ్యూవర్స్ కు కూడా ఉంటే గొడవే లేదు! ఇక ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో మొదటి రౌండ్ లో శ్రీరామ్ సేవ్ కాగా, రెండో రౌండ్ లో కాజల్ సేవ్ అయ్యింది.
దాదాపు వారం పాటు సీక్రెట్ రూమ్ లో ఉండి ఇంటి సభ్యుల వైఖరిని గమనించిన లోబోకు నాగార్జున ఓ టఫ్ టాస్క్ ఇచ్చాడు. వరెస్ట్ పెర్ఫార్మర్ ను ఎంపిక చేసే ఛాన్స్ ఇవ్వకుండా, కన్ఫెషన్ రూమ్ కు పిలిచి, హౌస్ మేట్స్ లో ‘ఎవరు తోపు – ఎవరు డూపు’ అనేది చెప్పమని కోరాడు. దాంతో తాను మాట్లాడుతున్న విషయం బయట వారికి తెలియదనే నమ్మకంతో లోబో నిర్భీతిగా మనసులో మాట చెప్పేశాడు. ప్రియాంక, కాజల్, ప్రియా, రవి, యానీ మాస్టర్, షణ్ముఖ్ తన దృష్టిలో డూప్ అని, మానస్, సన్నీ, విశ్వ, శ్రీరామ్, సిరి, జెస్సీ తోపు అని డిక్లేర్ చేశాడు లోబో. దీంతో లోబోకు రాబోయేది కష్టం కాలం అనిపిస్తోంది. ఏదేమైనా… శనివారం ఎపిసోడ్ కాస్తంత కూల్ గానే సాగిపోయింది. ఇక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు ప్రియా ఈ రోజు ఎలిమినేట్ అయిపోతే, బిగ్ బాస్ హౌస్ లో మగవాళ్ళు ఎనిమిది మంది, ఆడవాళ్ళు నలుగురు మిగులుతారు. ఈ వారమైన వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎవరైనా లేడీని బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతారో లేదో చూడాలి.